రేవంత్ వ్యాఖ్యలు సీనియర్లను కించపరిచేలా వున్నాయి : కోమటి రెడ్డి

ఇటీవల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న టిడిపి సీనియర్ నేత రేవంత్ రెడ్డి నిన్న కాంగ్రెస్ పార్టీ సమావేశంలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. తెలంగాణకు ముఖ్యమంత్రిని కావడమే తన లక్ష్యమంటూ రేవంత్ మాట్లాడం సరైనది కాదని, ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీలోని సేనియర్లని కించపరిచేలా ఉన్నాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీని త్వరలో తాను బంగారం చేస్తాను అని అనడం విడ్డూరంగా ఉందని, ఆయనదగ్గర అంత సత్తా ఉంటే అంతకుముందున్న టీడీపీని చేయలేకపోయారా అంటూ కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. నిజంగా నాయకుడు అవ్వాలన్న వ్యక్తికి ముందు ప్రజల సమస్యలు, వాటిపై ఎలా పోరాడడం అనేవి గుర్తుకు రవాలేతప్ప పదవులు కాదని, మనం చేసే ప్రయత్నం వల్ల మెల్లగా పదవులు వాటంతట అవే వస్తాయన్నారు.

ప్రజాసమస్యలపై తాను ఎన్నేళ్ళనుండో పోరాడుతున్నానని, తెలంగాణ ప్రజలకోసం మంత్రిపదవిని సైతం వద్దనుకున్నాను అన్నారు. అప్పట్లో నల్గొండలో ఫ్లోరైడ్ బాధితులకు నిరవధిక దీక్ష చేపట్టానని చెప్పారు. తనపై అసెంబ్లీలో వేటుపడిన నేపథ్యంలో ఎమ్యెల్యే సంపత్ తో కలిసి రెండురోజులపాటు నిరవధిక దీక్ష చేపట్టామని, తనకు దీక్ష చేయమని రేవంత్ చెప్పారు అనడం విడ్డూరమని అన్నారు. రేవంత్ ఇకనైనా ప్రజలకు మేలు చేసే విధంగా వ్యవహరించాలని, అది ఆయన రాజకీయ భవిష్యత్తుకు మంచి బాట అవుతుందని హితవు పలికారు…….

Comments