ప్రచురణ తేదీ : Sat, Jan 7th, 2017

ఆంధ్రా వారి మీద కెసిఆర్ కి విపరీతమైన ప్రేమ, తెలంగాణా అంటే ఇష్టం లేదు

revanth-reddy
దళితుల విషయం లో తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ ద్వంద్వ వైఖరి చూపిస్తున్నారు అంటూ రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేసారు. దళితుల సమస్యల పైన , దళిత క్రీడాకారులని ప్రోత్సహించడం లో కూడా కెసిఆర్ వివక్ష చూపిస్తున్నారు అనేది రేవంత్ వాదన. ఆంధ్రా ప్రాంత వాసుల మీద అభిమానం చూపుతూ తెలంగాణా వారిని పూర్తిగా పక్కకి వదిలేస్తున్నారు అని ధ్వజం ఎత్తుతున్నారు ఆయన. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తెలంగాణ బిడ్డలు పూర్ణ – ఆనంద్ లకు రూ. 25 లకల బహుమానాన్ని ఇచ్చామని సీఎం కేసీఆర్ గొప్పగా చెప్పుకుంటున్నారని అయితే తెలంగాణకు సంబంధంలేని పీవీ సింధుకు రూ. 4 కోట్ల బహుమానాన్ని ఇవ్వడంతో పాటు హైదరాబాద్ నగరంలో రూ. 10 కోట్ల విలువైన స్థలాన్ని కూడ కానుకగా ఇచ్చారని రేవంత్ గుర్తుచేశారు. సానియా మీర్జా కోసం కూడ సీఎం కోట్ల రూపాయలు ఖర్చు చేశారని చెప్పారు. ఈ ప్రాంతానికి చెందని పీవీ సింధుకు కోట్ల రూపాయల విలువైన 1000 గజాల స్థలాన్ని కేటాయించిన కేసీఆర్ – తెలంగాణ బిడ్డలైన పూర్ణ – ఆనంద్ లకు కనీసం 200 గజాల స్థలాలనైనా ఇచ్చారా? అని రేవంత్ నిలదీశారు.

Comments