ప్రచురణ తేదీ : Mon, Jan 9th, 2017

టీటీడీపీ ఫైర్‌బ్రాండ్ నోరు జారి బుక్క‌య్యాడు!

REVANTH
“తెలంగాణకు సంబంధం లేని పీవీ సింధుకు కోట్ల రూపాయలు ఇచ్చిన కేసీఆర్ ప్రభుత్వం ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన తెలంగాణ విద్యార్థులకు మాత్రం కేవలం పాతిక లక్షలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుంది“.. ఇది టీటీడీపీ ఫైర్‌బ్రాండ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్య‌. ఈ వ్యాఖ్య ఇప్పుడు పెనుదుమారం రేపుతోంది. రేవంత్ త‌ప్పుగా మాట్లాడాడ‌ని అది కూడా అసెంబ్లీ మీడియా పాయింట్లో ఇలా వ్యాఖ్యానించ‌డం దారుణ‌మ‌ని తేదేపా ఇన్‌స‌ర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఈ విష‌యంపై తేదేపా నేత‌లే అసంతృప్తిగా ఉన్నారు.

రేవంత్ నోరు అదుపులో ఉండేలా చంద్ర‌బాబు హెచ్చ‌రించాల‌ని కోరిన‌ట్టు తెలుస్తోంది. రేవంత్ కేసీఆర్‌ని ఇర‌కాటంలో పెట్టాల‌ని తానే ఇర‌కాటంలో ప‌డ్డాడు. ఎవ‌రికోస‌మో ఎవ‌రినో బ‌లిపెట్టేలా మాట్లాడార‌ని విమ‌ర్శ‌లొస్తున్నాయి. టీటీడీ బోర్డ్ స‌భ్యుడు సండ్ర వెంక‌ట వీర‌య్య‌, అరికెల న‌ర్సారెడ్డి తెలంగాణ వాసులు కాదా? అన్న ప్ర‌శ్న‌లు రేవంత్‌కి సంధిస్తున్నారు. తెలంగాణ‌లో ఉన్న‌వారికి ఏపీలో నామినేటెడ్ పోస్టులు క‌ట్ట‌బెట్ట‌డాన్ని రేవంత్ గుర్తు చేసుకోలేదా? ఆ సంద‌ర్భంలో అంటూ ఫైర‌వుతున్నారు.

Comments