ప్రచురణ తేదీ : Thu, Oct 12th, 2017

స‌గం ధ‌ర‌కు రిల‌య‌న్స్ ఫోన్లు, 399 రీఛార్జ్ ఫ్రీ ఫ్రీ

రిల‌య‌న్స్ జియో ధ‌మాకా ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది. ఈనెల 19 నుంచి తన టారిఫ్ ప్లాన్స్ రివైజ్ నేప‌థ్యంలో .. తన వినియోగ‌దారుల కోసం ప్ర‌త్యేకంగా దీపావళి ఆఫ‌ర్స్‌ని ప్ర‌వేశ‌పెడుతోంది. ఇన్నాళ్లు జియో ధనా ధన్ ఆఫర్ గా పిలుస్తున్న ఈ కొత్త ఆఫ‌ర్‌.. 12 నుంచి 18 అక్టోబర్ మధ్య వ‌ర్తిస్తుంది. జియో వినియోగ‌దారుడు రూ. 399 ల రీఛార్జ్ చేస్తే 100% క్యాష్ బ్యాక్ వ‌ర్తిస్తుంది. అంటే మూడు నెల‌ల పాటు డేటాని ఉచితంగా ఇచ్చే ఆఫ‌ర్ అన్న‌మాట‌! అది కూడా ప్ర‌స్తుతం కొనసాగుతున్న ప్లాన్ ముగిసినప్పుడు ఈ ప్లాన్ అమలులోకి వస్తుందిట‌.

ఎలానూ అక్టోబ‌ర్ మిడిల్‌లో 20లోపు రీఛార్జ్ చేసుకోవాలి అనుకునే వారికి ఇది ఓ వ‌రం లాంటిది. అయితే ఈ 100% క్యాష్ బ్యాక్ 8 వోచర్స్ రూపంలో లభిస్తాయి. స్తుంది , ఈ ప్రత్యేక వాచర్ యొక్క ధర రూ. 50 ఉంటుంది . యూజర్స్ ఈ వోచర్స్ ని Rs. 309 లేదా అంత కంటే ఎక్కువ రీఛార్జ్, లేదా డేటాను యాడ్ చేయటానికి రూ. 91లేదా అంత కంటే ఎక్కువ రీఛార్జ్ కోసం ఉపయోగించవచ్చు.ఈ వోచర్స్ యొక్క లాభం 15 నవంబర్ తరువాత పొందవచ్చు. మై జియో యాప్ , జియో . కామ్ , రిలయన్స్ డిజిటల్ స్టోర్స్ , జియో స్టోర్స్ , పే టీఎం , అమెజాన్ పే , ఫోన్ పే అండ్ మొబి క్విక్ వంటి సర్వీసెస్ ద్వారా ఈ ప్ర‌యోజ‌నం పొందొచ్చ‌ని జియో ప్ర‌క‌టిచింది. ఇక ఇప్ప‌టికే రిల‌య‌న్స్ లైఫ్ ఫోన్ల ధ‌ర‌లు దిగొచ్చాయి. ఇంత‌కాలం రూ.4000 పైగా ఉన్న ధ‌ర‌లు కాస్త ఎయిర్‌టెల్ – కార్బ‌న్ పోటీతో స‌గానికి స‌గం త‌గ్గిస్తున్న‌ట్టు రిల‌య‌న్స్ సంస్థ ప్ర‌క‌టించింది. జియో తన జియో ఫోన్ అమ్మ‌కాలు ఇప్ప‌టికే మొద‌ల‌య్యాయి.

Comments