జనసేనలోకి రెబెల్ స్టార్…?

పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలోకి భారీగా చేరికలు నమోదు అవుతున్నాయి, ఇతర పార్టీల నుంచి అంతే కాకుండా మాజీ ఎమ్మెల్యేలు ఇంకా కొందరు ప్రముఖులు కూడా జనసేన తీర్ధం పుచ్చుకుంటున్నారు.ఇది ఇలాఉండగా జనసేన యొక్క కార్యకర్తలు కూడా అంతే వేగంగా ప్రజల్లోకి జనసేన యొక్క సిద్ధాంతాలను బలంగా తీసుకెళ్తున్నారు.. అంతే కాకుండా బూత్ స్థాయి నుంచి ప్రతీ గ్రామంలో జనసేన సభ్యత్వాలు నమోదు చేస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 70 లక్షల పై చిలుకు సభ్యత్వాలు నమోదు చేసినట్టు తెలుస్తుంది.

ఐతే ప్రస్తతం ఉన్న తాజా సమాచారం ప్రకారం రెబెల్ స్టార్ కృష్ణం రాజు గారు జనసేన పార్టీలో చేరబోతున్నారు అంటూ వార్త బలంగా వినిపిస్తుంది. అక్టోబరు 5వ తేదీన కృష్ణం రాజు గారు జనసేన అధ్యకుడు పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన తీర్ధం పుచ్చుకోనున్నట్టు సమాచారాం. ఇది తెలిసిన పవన్ అభిమానూలు కొంత మంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు మరి కొంత మంది ఆయన ఇది వరకు బీజేపీ పార్టీ లో ఉన్నారని ఆ పార్టీలో చెప్పుకోదగ్గ స్థాయిలో ఏ సేవ చెయ్యలేదని ఇప్పుడు మాత్రం జనసేనలోకి వచ్చి ఏం చేస్తారు అని అంటున్నారు. ఒకవేళ ఈ కలయిక నిజమే ఐతే ఒక చిన్నపాటి సంచలనమే అని చెప్పాలి..

Comments