షాకింగ్ వీడియో : డ్రాగన్స్ నిజంగా ఉన్నాయా?.. ఈ అస్థిపంజరం ఏమిటి?

అత్యధిక జనాభా కలిగిన చైనాలో ప్రజలకు నమ్మకాలు చాలా గట్టిగానే ఉంటాయి. వారికి దైవభక్తి కూడా చాలానే ఉంటుంది. అయితే ఎవరు ఊహించని విధంగా చైనాలో ఒక షాకింగ్ నిజం అందరిని భయపెడుతోంది. 60 అడుగుల అస్థిపంజరంను చూసి అందరు షాక్ అవుతున్నారు. అంతే కాకూండా చుట్టూ పక్కల ఉన్న జనాలు కూడా దాన్ని చూడటానికి వస్తున్నారు. చైనా పురాణాల్లో డ్రాగన్స్ ప్రస్తావన చాలానే ఉంటుంది. చైనా గుర్తు కూడా అదే అని అందరికి తెలిసిన విషయమే. అయితే 60 అడుగులున్న డ్రాగన్ లాంటి అస్థిపంజరం ఇప్పుడు చైనాలోని ఝాంగ్జియా నగరంలో కనిపిస్తోంది. దీంతో ఆశ్చర్యపోవాలో బయపడాలో తెలియక అక్కడి ప్రజలు సతమతమవుతున్నారు. ప్రస్తుతం దానికి సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Comments