ప్రచురణ తేదీ : Sat, Sep 30th, 2017

రాయపాటి కొడుకుకు బంపర్ ఆఫర్ !

నరసారావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు తనయుడి భారీ అఫర్ దక్కింది. పెద్ద గా రాజకీయానుభవం లేకుండానే రాయపాటి తనయుడు రాయపాటి రంగారావు ఎంపీ గా అయ్యే అవకాశం దక్కింది. వచ్చే ఎన్నికల్లో తన తండ్రి నరసారావు పేట స్థానం రంగారావుకే ఖరారు అయినట్లు టీడీపీలో వార్తలు వస్తున్నాయి. రాయపాటి సీనియర్ పొలిటిషియన్ గా సుపరిచితుడే. కానీ ఆయన తనయుడి గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. మునుపెన్నడూ రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రజలు గమనించలేదు.

కానీ వారసత్వం ఉండడంతో లాబీయింగ్ నిర్వహించిన రాయపాటి తన తనయుడికి ఎంపీ సీట్ దక్కేలా పావులు కదిపారట. ఈ మేరకు చంద్రబాబు నుంచి హామీ దక్కినట్లు టీడీపీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. గత రెండు పర్యాయాలుగా టిడిపి నేతలే నరసారావు పేటనుంచి విజయం సాధిస్తున్నారు.

Comments