ప్రముఖ నటికి కోర్టు సమన్లు

rambha
ఒకప్పుడు తెలుగులో అందరి టాప్ హీరోలతో నటించి అగ్రస్థానం కైవసం చేసుకున్న రంభ తరువాత తెలుగులో అవకాశాలు లేకపోవడంతో పెళ్లి చేసుకుంది. ఇప్పుడు తన భర్తతో విడాకులు కూడా తీసుకోబోతుంది. అయితే వరకట్న వేధింపుల కేసులో కోర్టుకు హాజరు కాని రంభకు హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీసులు వెంటనే న్యాయస్థానానికి రావాలని సమన్లు జారీ చేశారు. ప్రస్తుతం ఆమె పద్మాలయ స్టూడియోలో ఒక టీవీ ఛానల్ నిర్వహిస్తున్న డాన్స్ షో కార్యక్రమానికి న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారని తెలుసుకున్న పోలీసులు సరాసరి పద్మాలయ స్టూడియోకు చేరుకొని షో టైంలోనే ఆమెకు సమన్లు అందజేశారు.

రంభ సోదరుడు శ్రీనివాసరావు వివాహం 1999లో బంజారాహిల్స్ రోడ్ నంబర్-2 లో నివసించే పల్లవి అనే యువతితో జరిగింది. పల్లవికి 2014 నుండి అత్తింటి వేధింపులు ప్రారంభం కావడంతో… పల్లవి అదే ఏడాది భర్త, అత్తమామలు, ఆడపడుచులపై నాంపల్లిలోని మూడవ చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. దీంతో కోర్ట్ ఆదేశం మేరకు 2014 జులై 21న బంజారాహిల్స్ పోలీసులు రంభ, భర్త, అత్తామామలపై ఐపీసి 499 (ఏ) క్రింద కేసు నమోదు చేశారు. అయితే రంభ అమెరికాలో ఉండడంతో ఎన్నిసార్లు సమన్లు అందజేయాలన్నా కుదరలేదు. ఇప్పుడు ఒక టీవీ షో నిమిత్తం హైదరాబాద్ వచ్చిందని తెలుసుకుని కోర్టుకు హాజరు కావాల్సిందిగా సమన్లు అందజేశారు.

Comments