ప్రచురణ తేదీ : Thu, Sep 22nd, 2016

చిరంజీవిపై వైసిపి నేత దాడి చేయించారా..?

chiru
కాపు కార్పొరేషన్ చైర్మన్ రామానుజయ తుని ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న భూమన పై సంచలన వ్యాఖ్యలు చేశారు.తుని ఘటనలో జగన్ పాత్రని కూడా పరిశీలించాలని ఆయన డిమాండ్ చేశారు.ఎందుకంటే.. తుని ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసిపి నేత భూమన కరుణాకర్ రెడ్డి ఆ పార్టీ అధినేత జగన్ కు దగ్గర బంధువని అన్నారు. తుని ఘటనలో తనపై వచ్చిన ఆరోపణలకు భూమన సమాధానం చెప్పకుండా తప్పించుకుంటూ చంద్రబాబు పై విమర్శలు చేయడం తగదని అన్నారు.

చంద్రబాబు కుటుంబానికి నేర చరిత్ర లేదని అన్నారు.నేర చరిత్ర ఉన్నది జగన్ కుటుంబానికేనని ఆరోపించారు.తిరుపతిలో చిరంజీవి పై భూమన దాడి చేయించారని ఆరోపించారు. అలాగే మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ, ఎమ్మెల్సీ చెంగల్రాయుడి పై భూమన దాడి చేయించారని ఆరోపించారు. తుని సభ జరిగిన కొబ్బరి తోటని పరిశీలించాల్సిన అవసరం భూమనకు ఏమొచ్చిందని నిలదీశారు.

Comments