జనసేనకు జై కొట్టిన రామ్ చరణ్..బాబాయ్ ఆల్ ది బెస్ట్ అంటూ విషెస్ !

పవన్ కళ్యాణ్ క్రమంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ సంచలనంగా మారుతున్నారు. రాజకీయ రంగం నుంచి పవన్ కళ్యాణ్ ఇప్పటికి కొంతమంది మద్దత్తు దారులు ఉన్నారు. సినిమా రంగం లో కూడా పవన్ కళ్యాణ్ వెల్ విషర్స్ త్రివిక్రమ్ లాంటి వాళ్ళు ఉండనే ఉన్నారు. కాగా పవన్ కళ్యాణ్ కు రాజకీయం గా తన కుటుంబం నుంచి అయితే ఇప్పటివరకు ప్రత్యక్ష మద్దత్తు అందలేదు. ఆదిశగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముందడుగు వేసాడు.బాబాయ్ కి శుభాకాంక్షలు తెలియజేస్తూ జనసేనకు జై కొట్టేశాడు.

తన పేస్ బుక్ పేజీ లో రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ చలోరే చలోరే చల్ యాత్రకు మద్దత్తు ప్రకటించారు. బాబాయ్ చలోరే చలోరే చల్ యాత్రని అద్భుతంగా ప్రారంభించారని ప్రశంసించాడు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కు రామ్ చరణ్ నుంచి నైతిక మద్దత్తు అందినట్లయింది.

Comments