ప్రచురణ తేదీ : Thu, Oct 12th, 2017

మరో రెండు రోజుల్లో భారీ వర్షాలు.. జాగ్రత్త ఎందుకంటే?


ఈ ఏడాది వర్షాకాలంతో కొన్ని ప్రాంతాలకు తిప్పలు తప్పేలా లేవు. రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు బాగానే కురుస్తున్నాయి. అయితే రానున్న రోజుల్లో ఇప్పటివరకు పడిన వర్షాలకంటే ఎక్కువ స్థాయిలో వర్షాలు పడేట్లు ఉన్నాయని వాతావరణ శాఖ నుంచి సమాచారం అందుతోంది. అయితే ఇప్పటికే హైదరాబాద్ భారీ వర్షాలతో అతలాకుతలం అవుతోంది. దానికి తోడు ట్రాఫిక్ సమస్య మరింత ఎక్కువవ్వడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఇక వచ్చే వారం రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. రాయలసీమలో ఇప్పటికే కురిసిన వర్షాలకు వాగులు, చెరువులు మునిగిపోయాయి. పంట చేతికి అందుతుందని ఎదురుచూసిన సమయంలో వర్షం తాకిడికి చాలా మంది రైతులు నష్టపోయారు. తెలంగాణాలో కూడా కొన్ని గ్రామాల్లో భారీ వర్షాలకు పంటలు మునిగిపోయి రైతన్నలకు కన్నీరును మిగిల్చింది. అయితే మరో రెండు రోజుల్లో దట్టమైన మేఘాలతో ఉరుములు , మెరుపులతో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.

Comments