ప్రచురణ తేదీ : Thu, Oct 12th, 2017

‘ఉప్పల్’ ని ఫ్యాన్లతో ఆరబెడుతున్నారు..వరుణుడా రేపొక్కరోజు..!!

వరుణుడా రేపొక్కరోజూ హైదరాబాద్ వంక చూడకు.. అని భాగ్యనగర క్రికెట్ ప్రియులు కోరుకుంటున్నారు. శుక్రవారం టీం ఇండియా – ఆస్ట్రేలియాల మధ్య నిర్ణయాత్మక మూడవ టి 20 మ్యాచ్ జరగనుంది. హైదరాబాద్ లో జరగబోతున్న తొలి అంతర్జాతీయ టి 20 మ్యాచ్ ఇదే కావడం విశేషం. కానీ అభిమానుల ఆశలకు వరుణుడు గండి కొట్టేలా కనిపిస్తున్నాడు. నగరంలో గత కొన్ని రోజులుగా వర్షం కురుస్తోంది. శుక్రవారం కూడా వర్ష సూచనలు మెండుగా ఉన్నాయని, మ్యాచ్ కు అంతరాయం కలగొచ్చని వాతావరణ శాఖ పేర్కొంటోంది.

సిరీస్ లో చెరో మ్యాచ్ నెగ్గిన ఇరుజట్లు సమఉజ్జీలుగా ఉన్నాయ్. మ్యాచ్ కనుక జరిగితే రసవత్తర పోరుని ఎంజాయ్ చేసే అవకాశం నగరవాసులకు కలుగుతుంది. వర్షం కురిస్తే మాత్రం ఆశలు ఆవిరైనట్లే. ఇదిలా ఉండగా ఉప్పల్ స్టేడియంలో పిచ్ ని కాపాడేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షం వలన ఏర్పడిన తడిని టేబుల్ ఫ్యాన్లతో ఆరబెడుతున్నారు. వర్షం కురిసే సమయంలో పిచ్ ని కవర్లతో కప్పి ఉంచుతున్నారు.

Comments