ప్రచురణ తేదీ : Dec 5, 2017 4:40 PM IST

రాహుల్ గాంధీ మ్యాథమెటిక్స్ లో వెరీ పూర్..మళ్లీ బుక్కయ్యారు..!

త్వరలోనే రాహుల్ గాంధీ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా పార్టీ పగ్గాలు చేపట్టడం లాంఛనమే. సోమవారం అధ్యక్ష పదవి కోసం రాహుల్ మినహా మరెవరూ నామినేషన్ దాఖలు చేయలేదు. జాతీయ పార్టీ అధ్యక్షుడు కాబోతున్న రాహుల్ కు లెక్కలు కూడా రావా అంటూ సోషల్ మీడియాలో దండయాత్ర మొదలైపోయింది. రాహుల్ చేసిన చిన్న పొరపాటు వలన ఆయనపై సెటైర్లు పేలుతున్నాయి. అసలేం జరిగిందనే వివరాల్లోకి వెళితే..

కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న నిత్యావసర ధరల్ని, ప్రస్తుతం మోడీ ప్రభుత్వంలో అమలవుతున్న ధరల్ని పోలుస్తూ రాహుల్ సోషల్ మీడియాలో ఓ టేబుల్ ద్వారా వివరించారు.రాహుల్ పేర్కొన్న ధరలన్నీ పక్కాగా కరెక్ట్. కానీ ధరల పెరుగుదల పర్సెంటేజ్ లో తప్పులో కాలేశారు. కందిపప్పు ధర రూ 45 నుంచి రూ 80 కి పెరిగింది. అంటే 77 శాతం పెరిగిందని పేర్కొనాలి. కానీ రాహుల్ గాంధీ పొరపాటుగా 177 శాతం అని పేర్కొనడంతో సోషల్ మీడియా వేదికగా సెటైర్ల పటాకులు పేలుతున్నాయి. రాహుల్ గాంధీ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ అయ్యారు.

Comments