మహేష్ బాబు డైలాగ్ రాహుల్ గాంధీ వర్షన్ లో..!

‘భయపెట్టడం మాకు తెలుసు’ అంటూ స్పైడర్ చిత్రంలో మహేష్ బాబు విలన్ కి వార్నింగ్ ఇచ్చే సన్నివేశం చాలా బావుంటుంది. ఈ చిత్రాన్ని రాహుల్ గాంధీ చూసి ఉండకపోవచ్చు. కానీ మహేష్ బాబు తరహాలోనే రాహుల్ గాంధీ తెలంగాణలోని ఇతర పార్టీలకు ధమ్కీ ఇస్తున్నారు. మొన్నటి వరకు అధికార పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ తో చెలరేగిపోయింది. ఇక తెలంగాణాలో విపక్షాలు కనుమరుగైపోతాయా అనేంతగా కాంగ్రెస్ పార్టీలోని నేతలు, టీడీపీ లోని నేతలు వరుసగా టిఆర్ఎస్ లోకి దూరిపోయారు.

కేసీఆర్ ముందు ఇక విపక్షాలు సున్నా కావడం ఖాయం అని విశ్లేషణలు కూడా వినిపించాయి. కాగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్ష భాద్యతలు చేపట్టడానికి కొద్దీ రోజుల ముందు టీడీపీ నేత రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ గాలం వేశారు. ఏ రేవంత్ రెడ్డితో అయితే అధికార పార్టీ ఆరంభంలో ఇబ్బంది పడిందో ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి టిఆర్ ఎస్ పై చెలరేగిపోతున్నారు. ఇప్పుడు మరోమారు రాహుల్ గాంధీ మార్క్ రాజకీయం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. కీలక బిజేపి నేత నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి సిద్ధం అయిపోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా నాగంని పార్టీ మార్పు గురించి ప్రశించగా ఉగాది తరువాత తన నిర్ణయాన్ని ప్రకటిస్తాని అన్నారు. ‘అపరేషన్ ఆకర్ష్’ తో విపక్షాలకు ఊపిరాడకుండా చేసిన టిఆర్ఎస్ కు మహేష్ బాబు తరహాలో రాహుల్ కౌంటర్ ఇస్తున్నారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ‘ఆకర్షించడం మాకు తెలుసు’ అనేలా రాహుల్ గాంధీ ఇతరపార్టీల నేతలని కాంగ్రెస్ లోకి లాగేస్తూ బలం పెంచే పనిలో ఉన్నారు.

Comments