లేడీస్ టాయిలెట్ లోకి దూరేసిన రాహుల్..అందరికీ షాక్..!

తన తల్లి సోనియా గాంధీ విశ్రాంతి తీసుకుంటుండడంతో కాంగ్రెస్ బరువు బాధ్యతలు యువరాజు రాహుల్ కు ఎక్కువైనట్లు ఉన్నాయి. అందుకేనేమో నిత్యం బిజెపికి ఎలా చెక్ పెట్టాలని రాహుల్ ఆలోచిస్తున్నట్లు ఉన్నారు. ఈ ఆలోచనలతో ఏమరపాటులో ఆయన లేడీస్ వాష్ రూమ్ లోకి వెళ్లిన ఘటన అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. రాహుల్ గాంధీ ప్రస్తుతం గుజరాత్ పర్యటలో ఉన్నారు.

చోటా ఉదయ్ పూర్ జిల్లాలో సంవాద్ అనే కార్యక్రమంలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో రాహుల్ గాంధీ ప్రసంగం అంతరం బయలుదేరారు. ఈ క్రమంలో ఆయన పురుషుల వాష్ రూమ్ లోకి వెల్లబోయి మహిళల వాష్ రూమ్ లోకి దూరేశారు. దీనితో ఈ ఘటన అక్కడ హాస్యాస్పదంగా మారింది. రాహుల్ గాంధీ నవ్వుల పాలు కాకుండా కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రయత్నించారు. వాష్ రూమ్ బయట మహిళలు అని రాసి ఉంది.. కానీ రాహుల్ కు భాష అర్థం కాకపోవడంతోనే ఈ పొరపాటు జరిగిందని కాంగ్రెస్ వర్గాలు సమర్థించుకున్నాయి.

Comments