ప్రచురణ తేదీ : Jan 23, 2017 3:30 PM IST

ఉద్యమం వద్దు.. విజయోత్సవాలు చేసుకుందాం అంటున్న లారెన్స్

Raghava-lawrence
తన డాన్సులతో యువతరాన్ని ఉర్రుతలూగిస్తున్న లారెన్స్ తన నటన, దర్శకత్వంతో కూడా ప్రేక్షకులను మెప్పించారు. ఇంత టాలెంట్ ఉన్న లారెన్స్ కేవలం సినిమా ఇండస్ట్రీ గురించే ఆలోచించరు. ఎవరు బాధల్లో ఉన్నా అందరికంటే ముందే తాను అక్కడ ప్రత్యక్షమవుతాడు. దాదాపు 113 మంది పేద పిల్లలకు ఆయన ఉచితంగా గుండె ఆపరేషన్లు చేయించి వాళ్ళను కాపాడిన మానవతావాది లారెన్స్. కొన్నిరోజులుగా తమిళనాడులో జల్లికట్టు కోసం ఉద్యమాలు జరుగుతున్నపుడు ఆ ఉద్యమాల్లో కూడా లారెన్స్ తన ప్రత్యేకతను చాటారు. ఉద్యమంలో పాల్గొన్న చాలామందికి ఆయన ఆహరం నీళ్లు అందించి తన మద్దతు ఉద్యమానికి సంపూర్ణంగా ఉంటుందని ప్రకటించారు.

తాజాగా ఉద్యమంలో చెలరేగిన హింసపై స్పందించిన లారెన్స్ తాను మెరీనా బీచ్ లో ఆందోళన కారులను కలుద్దామనుకున్నానని కానీ పోలీసులు అడ్డుకున్నారని ఆయన ఆవేదన చెందారు. దీంతో ఆయన పేస్ బుక్ ఖాతా నుండి ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఈ వీడియోలో ఆయన ఆందోళనకారులను కలవాలని, ఆర్డినెన్సు అంటే ఏమిటో వారికి తెలియజెప్పి ఖాళీ చేయాలనీ కోరతానని అన్నారు. ‘ఉద్యమించడానికి ఇంకేం లేదని, ఈ రోజు విజయోత్సవాలు చేసుకుందామని, తమిళనాడు గవర్నర్ శాశ్వత పరిష్కారం చూపిస్తానని అన్నారని లారెన్స్ తెలిపారు

Comments