ప్రచురణ తేదీ : Sat, Aug 12th, 2017

జగన్ కి హ్యాండ్ ఇచ్చే పనిలో ఉన్న ప్రశాంత్ కిశోర్? కారణం చాలా పెద్దది?


జగన్ కు రాజకీయ వ్యూహాలను అందించడానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రశాంత్ కిషోర్ అడుగుపెట్టారు. ప్రశాంత్ కిషోర్ వచ్చిన తరువాత వైసిపి కి ఎలాంటి ఉపయోగం జరిగిందనేదానిపై చర్చ జరుగుతోంది. ప్రశాంత్ కిషోర్ వచ్చాక రెండు విషయాలు మాత్రం స్ఫష్టంగా అర్థం అవుతున్నాయి. అందులో మొదటిటి ఏంటంటే.. జగన్.. చంద్రబాబు పై వివాదాస్పద విమర్శలు చేస్తూ మీడియాలో హైలైట్ అవుతున్నారు. రెండవది ఏంటంటే.. ప్రతిపక్షంలోకి అధికార పక్షం నుంచే వలసలు భారీగా పెరుగుతున్నాయి. ఈ రెండు ఐడియాలు ప్రశాంత్ కిషొర్ మెదడు నుంచి వచ్చినవే అని పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట.

2019 ఎన్నికలకు రెండేళ్లు మాత్రమే సమయం ఉంది. ఈ నేపథ్యంలో మీడియా దృష్టి మరలకుండా వైసిపి పైనే ఉండాలి. మీడియాని అట్రాక్ట్ చేసే ఆలోచన ప్రశాంత్ కిషోర్ చేసినట్లు తెలుస్తోంది. దానికోసం జగన్ ప్రసంగాలు హైలైట్ కావాలని సూచించారట. ఆయన చేసిన సూచనలతోనే జగన్ నంద్యాల ఎన్నికల ప్రచార స్క్రిప్ట్ రెడీ అవుతున్నట్లు మీడియాలో ఓ వార్త హంగామా చేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబుపై జగన్ చేసిన వ్యాఖ్యలు వివాదం సృష్టించాయి.కానీ ప్రజల నోళ్ళలో వైసిపి పేరు నానాలంటే ఇదే సరైన మార్గమని ఈ రాజకీయ వ్యూహకర్త ఆలోచన. అధికార పక్షంలోని చిన్నా చితకా నేతలైనా పరవాలేదు. ఈ సమయంలో వైసిపిలోకి వస్తే టిడిపి పై నెగిటివ్ వేవ్స్ వెళ్లే అవకాశం ఉంది. అది వైసిపి కి లాభించే అంశం. ఇందులో భాగంగానే శిల్పా సోదరుడు చక్రపాణి రెడ్డిని పట్టుబట్టి వైసిపిలోకి తీసుకుని రావడంలో ప్రశాంత్ కిషోర్ వ్యూహం ఫలించింది. మరో కొందరు నేతలకు కూడా నంద్యాల ఉపఎన్నిక పూర్తికాక ముందే గాలం వేయాలని పీకే జగన్ కు సూచించారట. వైసిపి అధికారం కోసం ప్రశాంత్ ఇంత చేస్తున్నా జగన్ వైసీఖరిలో మార్పు మాత్రం రావడం లేదనే సందేశాన్ని టిడిపి పంపుతోంది.

తాజగా ఏపీ డిప్యూటీ సీఎం కే ఈ కృష్ణ మూర్తి చేసిన వ్యాఖలు ఈ వాదం పెరిగేలా చేస్తున్నాయి. జగన్ ప్రవర్తనని ప్రశాంత్ కిషోర్ కూడా భరించ లేకపోయారని అన్నారు. జగన్ ని విడచి వెళ్లేందుకు ఆయన సిద్ధం అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి టిడిపి నేతలు జగన్ ప్రవర్తనని ఓ కారణంగా చెబుతుంటే మరికొన్ని కారణాలు కూడా వినిపిస్తున్నాయి. తన ఐడియాలనన్నింటిని ఉపయోగించి ప్లినరీ లో ‘నవరత్నాల లాంటి హామీలు’ని తెరపైకి తీసుకుని వచ్చారు. కానీ వైసిపి నేత అంబటి రాంబాబు మాత్రం ప్రశాంత్ కు ఇవ్వవలసిన మర్యాదని ఇవ్వకపోవడంలేదని రాజకీయ వర్గాల్లో ఓ భావన ఉంది. వైసీపీకి ఆల్రెడీ ప్రజా మద్దత్తు ఉందని, ఇప్పడు ప్రశాంత్ కిషోర్ రాగానే ఎదో అద్భుతం జరిగిపోతుందని తాము ఆశించడం లేదని అన్నారు. జగన్ ఇమేజ్ కి డోకా రాకుండా ప్రశాంత్ కిషోర్ ని తగ్గించారని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. మరో వైపు సోషల్ మీడియా వేదికగా చంద్రాబాబు పై జరుగుతున్న కుట్రని టీడీపీ పసిగట్టింది. ఈశాన్య రాష్ట్రాల్లో ఫేక్ అకౌంట్ లు క్రియేట్ చేసి వాటిద్వారా చంద్రబాబు పై నెగిటివ్ పబ్లిసిటి చేస్తున్నట్లు టిడిపి చెబుతోంది. దీనివెనుక ప్రశాంత్ కిషోర్ హస్తం ఉన్నట్లు కూడా టిడిపి వర్గాలు అంటున్నాయి. దీనిపై తాము లీగల్ యాక్షన్ తీసుకుంటామని వాళ్ళు చెబుతున్నారు. టిడిపి నేతలు ఇస్తున్న వార్నింగ్ మరోవైపు జగన్ ప్రవర్తన ఇలాంటి తల నొప్పులు ఎందుకు అనుకున్నాడో ఏమోకానీ జగన్ నుంచి వెనక్కు వెళ్ళడానికి ప్రశాంత్ కిషోర్ రెడీ అవుతున్నట్లు బలమైన ఊహాగానాలు మాత్రం వినిపిస్తున్నాయి.

Comments