కేసీఆర్ సంక్రాంతి కానుక!

ఎంతో కష్టపడి, ఎందరో అమరవీరుల త్యాగఫలితం, అలానే ఎన్నో దీక్షలు, ఉద్యమాలు ఎన్నేళ్ళనుంచో జరిగిన పోరాటాఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, రాష్ట్ర అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తున్నారు. ఇప్పటికే మిషన్ భగీరథ, స్వచ్ఛ హైదరాబాద్, డబల్ బెడ్ రూమ్ ఇళ్ళు వంటి పధకాలు ఆయన ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చాయి. అలానే పేద ప్రజలకు పెన్షన్లు, గర్భిణీలకు కేసీఆర్ కిట్లు, షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మి వంటి పధకాలు ఆయన్ని పేదలకు మరింత చేరువచేసాయి.
అసలు విషయంలోకి వెళితే ఎస్ సి, ఎస్ టి , మైనారిటీ , ఆర్ధికంగా వెనుకబడిన తరగతుల ఆడపిల్లల వివాహనిమిత్తం నాలుగేళ్లుగా అమలవుతున్న షాదిముబారక్, మరియు కల్యాణ లక్ష్మి వంటి పధకాల క్రింద ప్రస్తుతం 75,116/- ఇస్తుండగా, దానిని ఇకపై 1,00,116/- కు పెంచేలా కీలక నిర్ణయం ఒకటి తీసుకున్నట్లు అందిన సమాచారం ద్వారా తెలుస్తోంది. తదుపరి బడ్జెట్ లో ఈ పధకం అమలుకు కావలసిన నిధుల విషయమయి ఇప్పటికే కేంద్రానికి తెలిపినట్లు సమాచారం. ఏమైనా ఈ సంక్రాంతి నిజంగా తెలంగాణ ప్రజల పాలిట ఆనంద సంక్రాంతి కానుంది.

Comments