క్రైమ్ కహాని : ఐదు కట్టల 2వేల నోట్లు కొట్టేశారే.. సీటు కోసం వెళ్లి నదిలో శవమైన వైనం..!

c4
c1కొత్త నోట్లన్నీ వీరివద్దనే ఉన్నాయే : బ్యాంకుల్లో గంటల తరబడి క్యూలో నిలబడినా వారానికి 24 వేలు కూడా దొరకడం కష్టం. కొన్నిసార్లు డబ్బులు అయిపోయాయని వెనక్కి పంపేస్తున్నారు కూడా.పెద్ద నోట్ల రద్దుతో దేశంలో క్లిష్ట పరిస్థితులు నెలకొని ఉన్న సమయంలో అహమ్మదాబాద్ లోని ఓ కుటుంబం వద్ద మాత్రం ఐదు కట్టల 2 వేల రూపాయల నోట్లు(రూ 10 లక్షలు) దొరికాయి. కారులో ప్రయాణిస్తున్న ఆ కుటుంబాన్ని పోలీసులు తనిఖీ చేయగా వారి వద్ద ఈ మొత్తం డబ్బు దొరికింది. 2 వేళా నోట్లే కాక వారివద్ద వేరేనోట్లు కూడా చాలా ఉన్నాయ్. తాము పెళ్ళికోసమని వివిధ బ్యాంకులనుంచి డ్రా చేశామని తెలిపారు. కేంద్రం పెళ్లిళ్ల కోసం కేవలం రూ 2.5 లక్షలను మాత్రమే డ్రాచేసుకునే వెసులు బాటు కల్పించింది. దీనితో పోలీస్ లు వారిని అరెస్ట్ చేసి ఐటి అధికారులకు ఆ మొత్తాన్ని అప్పగించారు.

 

c2

పాక్ దురాగతం : జమ్మూకాశ్మీర్ లోని ఎల్ ఓసి వద్ద పాక్ ముష్కరులు మరోసారి దురాగతానికి తెగించారు. ఎల్ ఓసి దాటివచ్చి భారత సైనికుల్ని ముగ్గురిని పొట్టనపెట్టుకున్నారు. ఓ సైనికుడిని అతి కిరాతకంగా తల నరికి చంపారు.గత నెలరోజుల్లో ఇలా పాక్ ముష్కరులు బరితెగించడం రెండోసారి. మృతులని రాజస్థాన్ కు చెందిన ప్రభు సింగ్ (25), ఉత్తరప్రదేశ్ కు చెందిన కుష్వాహా(31), శశాంక్ సింగ్ (25) లుగా గుర్తించారు.దీనికి ప్రతీకారం ఉంటుందని భారత బలగాలు తెలిపాయి. తల నరికిన భారత సైనికుడి శవం పై ఈ దుశ్చర్య కు పాల్పడిన వారి సంతకాలు ఉన్నాయని అధికారులు తెలిపారు.

 

c3

చదువు భారం తట్టుకోలేక.. : ఐఐటి లో ర్యాంక్ సాధించాలనే లక్ష్యం తో బీహార్ కు చెందిన ఓ విద్యార్థి రాజస్థాన్ కు వెళ్లాడు. అక్కడ కోటాలోని శిక్షణ సంస్థ లో చేరాడు.ఆశిష్ సత్యం అనే విద్యార్థి తన మిత్రుడితో కలసి రూమ్ ఆదుకు తీసుకుని ఐఐటీ కి శిక్షణ పొందుతున్నాడు.కాగా నవంబర్ 19 నుంచి ఆ విద్యార్థి సత్యం కనిపించక పోవడం తో ఫిర్యాదు అందుకున్న పోలీస్ లు గాలింపు చేపట్టగా నదిలో ఓ శవం ఉందన్న సమాచారం తో పోలీస్ లు అక్కడికి చేరుకున్నారు. మృతి చెందినది సత్యమే అని నిర్థారించారు. సత్యం రాసిన సూసైడ్ నాట్ అతడి గదిలో దొరికిందని పోలీస్ లు వెల్లడించారు. అందులో తాను చదువు ఒత్తిడిని తట్టుకోలేకే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు రాసాడు.

Comments