నల్లకుబేరులకు మోడీ మరొక షాక్ ఇచ్చారు….?

bank-lockers
పెద్దనోట్ల ను కొన్ని గంటల వ్యవధిలోనే రద్దు చేసి సంచలన నిర్ణయం తీసుకున్న మోడీ నల్లకుబేరుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించారు. దేశ ప్రజలకు చెందాల్సిన సొమ్మును అక్రమంగా దాచుకున్న నల్లడబ్బు క్షణాలలో పనికిరాకుండా పోవడంతో అక్రమార్కులందరూ లబోదిబో మంటూ వాటిని మార్చుకోవడానికి ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలో కొంతమంది బడాబాబులు మీడియాకు, పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. పెద్దనోట్ల రద్దు ప్రకంపనలు ఇంకా కొనసాగుతుండగానే మోడీ నల్లబాబుల నెత్తి మీద మరొక పిడుగు వేశారు.

బ్యాంకు లాకర్లలో నల్లధనం, నగలను దాచిన నల్లకుబేరులపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. బినామీల పేరుతొ కొందరు బడాబాబులు బ్యాంకు లో లాకర్లు తీసుకుని పెద్ద ఎత్తున నల్లధనం దాచారని వార్తలు వస్తున్నా నేపథ్యంలో ఆదాయపన్ను శాఖ అధికారులను దాడులకు దింపింది. నవంబర్ 8న పెద్దనోట్ల రద్దు తరువాత ఎక్కువసార్లు లాకర్లను తెరిచిన వారి వివరాలను ఆదాయపన్ను శాఖ అధికారులు బ్యాంకుల నుండి సమాచారం సేకరించారు. అనుమానాస్పదంగా ఉన్న వారి ఖాతాలను… ఈ లాకర్లు ఎవరివి, ఎవరు నిర్వహిస్తున్నారు అనే విషయంపై ఆరా తీస్తున్నారు. మొత్తమ్మీద ఆదాయపన్ను అధికారుల దృష్టి అంతా బ్యాంకు లాకర్లపై పడడంతో మరొకసారి నల్లకుబేరుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.

Comments