ప్రచురణ తేదీ : Thu, Aug 10th, 2017

జగన్ ఊరూరా తిరిగేది అందుకేనా..పీకే సర్వేతో షాక్ ఇచ్చాడా..?

జగన్ నంద్యాలలోనే ఉంటూ ఊరూరా ప్రచారం నిర్వహిస్తున్నాడు. నంద్యాల ఉప ఎన్నికని అధికార పార్టీ టీడీపీ ఎంత సీరియస్ గాతీసుకుందో జగన్ కూడా అంతే సీరియస్ గా తీసుకున్నారు. అందుకే 2019 ఎన్నికల్లో పైచేయి సాధించాలంటే నంద్యాల స్థానాన్ని కైవసం చేసుకోవడం అవసరమని జగన్ భావిస్తున్నారు. దీనితో నంద్యాల ముఖ చిత్రం ఎలా ఉంది ఓటరు నాడి ఏంటి అనే విషయాన్ని పసిగట్టడాదికి ప్రశాంత్ కిషోర్ చే సర్వే నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ సర్వేలో వైసిపి ఒక మండలం మినహా మిగతా వాటిలో బలహీనంగా ఉందని ప్రశాంత్ కిషోర్ జగన్ కు తెలిపినట్లు రాజకీయా వర్గాలు చెబుతున్నాయి. దీనితో సుదీర్ఘంగా నిరయోజకవర్గంలో పర్యటించాలని జగన్ నిర్ణయించుకున్నారు.

నంద్యాల నియోజకవర్గం లోని గోస్సాడు మండలంలో వైసిపికి బాగా పట్టున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో ఈ మండలంలోనే వైసిపి అభ్యర్థిగా పోటీ చేసిన భూమా నాగిరెడ్డికి 750 ఓట్ల మెజారిటీ లభించింది. దీనితో ఈసారి కూడా ఈ మండలంలో పట్టు నిలుపుకుంటూనే బలహీనంగా ఉన్న మండలాలపై దృష్టి సారించాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Comments