వామ్మో.. పెట్రోల్ ధర!

petrol
భారతదేశంలో పెట్రో ఉత్పత్తుల ధరలు పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు హైదరాబాద్ లో లీటరు పెట్రోలు ధర 4.20రూపాయలు పెరిగి 67.22 నుండి 71.42రూపాయలు చేరుకుంది. అలాగే విజయవాడలో లీటరు పెట్రోలు 67.89 నుండి 71.85 రూపాయలకు చేరుకుంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం లీటరు పెట్రోలు 59.20 నుండి 63.16రూపాయలకు చేరుకుంది.

అలాగే డీజిల్ విషయానికి వస్తే హైదరాబాద్ లో లీటరు 53.40 నుండి 56 రూపాయలకు పెరిగింది. అదే విధంగా విజయవాడలో లీటర్ డీజిల్ 55.02 నుండి 57.39రూపాయలకు హెచ్చు అయ్యింది. ఇక అనూహ్యంగానే పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరలతో వాహన చోదకులకు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

Comments