మెట్రో ఛార్జీలు వాయించేస్తున్నారా?

హైద‌రాబాద్ న‌గ‌ర‌వాసుల మెట్రో రైలు క‌ల ఎట్ట‌కేల‌కు తీరింది. నేడు అధికారికంగా మెట్రో ప‌ట్టాలెక్కేసింది. అందులో కి ఆత్రుత‌గా జ‌నాలు ఎక్కి త‌మ అనుభూతుల‌ను పంచుకుంటున్నారు. అయితే మెట్రో చార్జీల మోత మాత్రం మాములుగా లేవ‌ని తొలి రోజే విమ‌ర్శ‌లు పోటెత్తాయి. మెట్రో ఆల‌స్య‌మ‌య్యే స‌రికి రైలు ఎప్పుడెక్కుదామాని ఆత్రుత ప‌డ్డారు గానీ.. ప‌ట్టాలెక్కితే ప్ర‌భుత్వాలు వాయించే చార్జీలు గురించి ఆలోచించ‌లేక‌పోయారు జ‌నాలు. మెట్రో ధ‌ర‌లు త‌క్ష‌ణం త‌గ్గించాల‌ని ప్రభుత్వాన్ని ప్ర‌జ‌లు కోరుతున్నారు. ట్రైన్ చూడ‌టానికి బాగుంది…ప్ర‌యాణం చేయ‌డానికి బాగానే ఉంది గానీ, ఛార్జీల మోత మాత్రం గ‌ట్టిగా ఉంద‌ని అసంతృప్తిని వ్య‌క్తం చేస్తున్నారు.

తొలి రోజే మెట్రో ఛార్జీల‌పై ప్ర‌జ‌ల నుంచి వ్య‌తిరేఖత రావ‌డంతో పాటు ప్ర‌తిప‌క్షాలు కూడా తోడ‌య్యాయి. ధ‌ర‌లు తగ్గించాల‌ని..లేదంటే ఆందోళ‌న‌కు దిగుతామని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. మెట్రో ఆల‌స్యానికి టీఆర్ఎప్ కార‌ణ‌మ‌ని..పెరిగిన వ్య‌యాన్ని ప్ర‌భుత్వ‌మే భ‌రాయించాల‌ని డిమాండ్ చేసింది. మ‌రి దీనిపై టీఆర్ ఎస్ ఎలా రియాక్ట్ అవుతుందో?

Comments