చంద్రబాబు కామెంట్స్ పై పయ్యావుల మనస్తాపం?

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రతి పక్ష హోదాలో ఉన్నా కూడా ఎక్కువగా తెలుగుదేశం పార్టీ నేతలే అధికార టీఆరెస్ పార్టీపై కామెంట్స్ చేసి వార్తల్లో నిలుస్తారు. ఈ రెండు పార్టీల మధ్యన ఏదైనా టాపిక్ వస్తే ఇక రెండు మూడు రోజులవరకు ఎదో ఒక న్యూస్ హల్ చల్ చేస్తూనే ఉంటుంది. రీసెంట్ గా పరిటాల రవి కొడుకు పెళ్లికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్లడం హాట్ టాపిక్ అయ్యింది.

అయితే ఆ వేడుకలో టీడీపీ నేత పయ్యావుల కేశవ్ కేసీఆర్ ని కలవడం అందరిని షాక్ కి గురి చేసింది. ముఖ్యంగా చంద్రబాబు వారి కలయికపై కాస్త అసంతృప్తిని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీంతో పయ్యావుల మనస్తాపానికి గురయ్యారట అంతే కాకుండా చంద్రబాబు గారు ఆ విషయం గురించి పూర్తిగా తెలుసుకోలేక అలా కామెంట్స్ చేశారని టీడీపీ సన్నిహిత నేతలతో చెప్పుకున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా కేసీఆర్ తో రాజకీయాలు మాట్లాడలేదని కేవలం స్నేహపూర్వకంగా కలిసానని చెబుతున్నారు. మొదట కేసీఆర్ వచ్చినప్పుడు నమస్కరించి వెళ్లిపోయాను ఆ తర్వాత కేసీఆర్ గారే ఒక ఉన్నత అధికారితో పిలిపించి కొంచెం సేపు మాట్లాడారని తెలిపారు.

Comments