ప్రచురణ తేదీ : Tue, Oct 24th, 2017

అభిమానితో సెల్ఫీ దిగి మరీ ట్వీట్ చేసిన పవన్.. అంత స్పెషల్ ఏంటంటే..!

జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ మారు మారు ట్విట్టర్ లో సందడి చేశారు. ఈ సారి పవన్ కాస్త డిఫెరెంట్ గా అభిమానితో సెల్ఫీ దిగడం విశేషం. పార్టీ కార్యాలయంలో పవన్ ఈ సెల్ఫీ దిగినట్లుగా తెలుస్తోంది. సామజిక సమస్యలపై నిరంతరం పోరాటం చేసే జనసేన కార్యకర్త ‘నిమ్మల వీరన్న’ అంటూ పవన్ కళ్యాణ్ అభిమాని పేరుని ప్రస్తావించారు.

ఇదిలా ఉండగా ఇటీవల జనసేన పార్టీ భవిషత్ కార్యాచరణపై కార్యాలయంలో పవన్ కీలక నేతలతో సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. వచ్చే ఆరునెలల సమయంలో పార్టీ చేయబోయే కార్యక్రమాల గురించి పవన్ కళ్యాణ్ నేతలతో చర్చించారు. త్వరలో జనసేన పార్టీ భారీ ప్లినరీ కార్యక్రమం నిర్వహించనుండడంతో ఆ పార్టీ కార్యకర్తలు ఉత్సాహంతో ఉన్నారు. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో జనసేన ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలియాలంటే మరి కొంత సమయం ఆగాల్సిందే.

Comments