ప్రచురణ తేదీ : Sep 27, 2018 3:03 AM IST

జగన్ బారి నుండి చంద్రబాబును రక్షించా : పవన్


జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రూట్ మార్చారు. ఇన్నాళ్లు ఒకరితో నాకు పనేంటి, నేనేం చేస్తానో అదే చెబుతాను, విమర్శలు చేయడం నాకవసరం లేదు అంటూ సభలు, సమావేశాల్లో మాట్లాడిన పవన్ ప్రస్తుతం ట్రెండ్ మార్చారు. యాత్రను కొనసాగిస్తున్న నియోజకవర్గాల్లో అధికారంలో ఉండే టీడీపీ నాయకుల్ని లీగల్ గా ఢీ కొడుతున్నారు. తాజాగా దెందులూరులో పర్యటించి, ప్రసంగిస్తున్న పవన్ స్థానిక నేత చింతమనేని ప్రభాకర్ పై విరుచుకుపడుతున్నారు.

చంద్రబాబు 27 కేసులున్న ఆకు రౌడీలను, చిల్లర రౌడీలను చీఫ్ విప్ గా పెట్టి పెద్ద తప్పు చేశారని, ఆయనే క్రమశిక్షణలో లేరని, ఇక తన నాయకుల్ని ఎలా క్రమశిక్షలో పెట్టుకుంటారని ప్రశ్నించారు. ఇక గత ఎన్నికల్లో చంద్రబాబును నేను విడిపోయిన రాష్ట్రంలో లాండ్ అండ్ ఆర్డర్ సరిగా ఉండేలా చూడాలని కోరానని, కానీ చింతమనేని లాంటి రౌడీలను పార్టీలో పెట్టుకుని మాట తప్పారని అన్నారు.

ఎన్నికల ముందు చంద్రబాబు తనను ఇంటికి పిలిచి పెట్టి భోజనం పెట్టి ఒకవేళ రాష్ట్రంలో మన ప్రభుత్వం రాకపోతే ఇద్దరం కలిసి పనిచేయాలని కోరారని, ఇది అయన వైఎస్ జగన్ కు బయపడి మాట్లాడిన మాటని, ఒక ముఖ్యమంత్రి స్థాయి నాయకుడు ఇలా జగన్ కు భయపడటం ఏమిటని, ఆరోజు ఆయన్ను జగన్ భయం నుండి కాపాడింది నేను, జనసైనికులేనని, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కాదని ఎద్దేవా చేశారు.

Comments