ప్రచురణ తేదీ : Tue, Jan 24th, 2017

తన సినిమాలోని పాటలను ప్రత్యేక హోదా కోసం మళ్ళీ విడుదల చేసిన పవన్ కళ్యాణ్

pawan
ప్రత్యేక హోదా డిమాండ్ ఊపందుకుంటున్న ఈ సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజలలో దేశభక్తిని రేకెత్తించడానికి ‘దేశ్ బచావో’ అనే పేరుతొ ఒక ఆల్బమ్ ను రూపొందించారు. నాలుగు పాటలు గల మ్యూజిక్ ఆల్బమ్ ను ఈ రోజు పవన్ కళ్యాణ్ విజయవాడలో విడుదల చేశారు. కాటమరాయుడు షూటింగ్ లో ఎంతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ సమయం చూసుకుని ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ ఆల్బమ్ ఒక యువకుడైన డీజే పృథ్వి తో రూపొందించారు. మొదటిపాట పవన్ కళ్యాణ్ నటించిన తమ్ముడు సినిమాలో ‘యురేకా’ అనే పాటను రీమిక్స్ చేశారు. రెండవ పాటగా జానీ సినిమాలోని ‘నా రాజు గాకురా’ అనే పాటను రీమిక్స్ చేశారు. అలాగే మూడవ పాటగా గుడుంబా శంకర్ సినిమాలోని ‘లే లే లేలే’ అనే పాటను, నాలుగవ పాటగా ఖుషీ సినిమాలోని ‘యే మేరా జహాఁ’ అనే సాంగ్ ను రీమిక్స్ చేశారు. ఈ నాలుగు పాటలలో కూడా పవన్ కళ్యాణ్ ఇంతకుముందు సభలలో ఉద్వేగభరితంగా మాట్లాడిన మాటలను ఈ పాటలలో జొప్పించారు. కానీ ఈ పాటలు అంత ఆకట్టుకోలేదని, దీని ద్వారా ఆయన ఏం చెప్పాలనుకున్నారో అర్ధం కాలేదని కొందరు అంటున్నారు.

Comments