ప్రచురణ తేదీ : Dec 6, 2017 11:01 AM IST

ముందు జనం, వెనుక కులం..జనసేనాని హాట్ టూర్ స్టార్ట్..!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అసలైన రాజకీయ ప్రయాణం మొదలైంది. తాను మద్దత్తు పలికిన ప్రభుత్వాలకే ఎదురెళ్లబోతున్నట్లు పవన్ హింట్ ఇచ్చేశారు. ఎన్నికలు కేవలం సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర టూర్ హాట్ టాపిక్ గా మారింది. కుంభ స్థలాన్నే ముందు కొట్టాలి అన్నట్లుగా జనసేనాని సెంట్రల్ ఇష్యూనే మొట్టమొదట టేకప్ చేయబోతున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో మోడీతో ఆలింగనాలూ, పక్క పక్కనే కూర్చుని ప్రసంగాలు.. వీరి స్నేహం ఓ రేంజ్ లో సాగింది. కాలం చాలా వేగం అన్నట్లుగా పరిస్థితి అంతా మారిపోయింది. విభజన హామీలని తుంగలోతొక్కిని బిజెపితో చెలిమి తనకు చేటు అని పవన్ ఇప్పటికే ఓ అవగాహనకు వచ్చేశారు. బీజేపీతో జనసేన తెగదెంపులు జరిగిపోయాయని ఆ పార్టీ చెప్పుకుంటున్నా..పవన్ దీనిని అధికారికంగా ప్రకటించేందుకు బలమైన సందర్భం కోసం ఎదురుచూస్తున్నారు.

డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ని ప్రయివేటీకరణ చేయడానికి కేంద్రం నిర్ణయించుకుంది. గత కొంత కాలంగా ఈ వ్యవహారం వైజాగ్ లో హాట్ హాట్ గా సాగుతోంది. డ్రెడ్జింగ్ ఉద్యోగులు ఇది వరకే తమ సమస్యని పవన్ తో విన్నవించుకున్నారు. మంచి లాభాలతో నడుస్తున్న డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ని ఇప్పటికిప్పుడు ప్రయివేట్ పరం చేయడంలో ఉన్న కేంద్రం ఆంతర్యం ఏంటనేది ఉద్యోగుల ప్రశ్న. తమ బతుకులు ఏంకావాలని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంకటేష్ అనే ఉద్యోగి ఇటీవల ఆత్మహత్యకు పాల్పడడంతో జనసేనాని ఈ ఇష్యూని సీరియస్ గా తీసుకున్నారు. ఈ పర్యటన ద్వారా కేంద్ర ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసే ఉద్దేశంలో జనసేనాని ఉన్నట్లు తెలుస్తోంది.

కేవలం జనం తాలూకు సమస్యలే కాక పవన్ ముందు అనేక రాజకీయ పరమైన సవాళ్లు కూడా ఉన్నాయి. జనసేన పార్టీకి సంబంధించిన విధివిధానాల విషయంలో ఆయన క్లారిటీ ఇవ్వాలి. కాపు రిజర్వేషన్ లాంటి కులం తాలూకు సమస్యలు ఎలాగూ ఉన్నాయి. ఇలాంటి వేడెక్కించే సమస్యలతో జనసేనాని ఉత్తరాంధ్ర పర్యటన ప్రారంభం అయింది.

Comments