నేరుగా ఆ రైతుతో మాట్లాడనున్న జనసేనాని..!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొలిటికల్ టూర్ మంచి జోరుగా సాగుతోంది. జనసైనికులు ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో వైజాగ్, రాజమండ్రి వేదికగా వివరించిన పవన్ పలు సంచలన వ్యాఖ్యలు చేయడం విశేషం. ప్రజారాజ్యం పార్టీ అనుభవాల్ని గుర్తు చేసుకుంటూ సొంత కుటుంబంలోని వ్యక్తినే విమర్శించి సెగలు రేపారు. కాగా నేడు అమరావతిలో పవన్ కళ్యాణ్ పర్యటన ఉండనుంది.

గత కొన్ని రోజులుగా ఫాతిమా కళాశాల విద్యార్థులు ఆందోళన నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాటర్ సాక్షాత్తూ సీఎం వద్దకే వెళ్ళింది. పవన్ కళ్యాణ్ విద్యార్థులతో భేటీ అయి వారి సమస్యలని తెలుసుకోనున్నారు. అనంతరం ఆయన జనసేన పార్టీ కార్యాలయాన్ని నిర్మించే భూమిని సందర్శిస్తారు. ఆ భూ యజమాని రైతుతో నేరుగా పవన్ కళ్యాణ్ మాట్లాడనునట్లు తెలుస్తోంది.

Comments