జనసేనాని పయనమైనాడు..వారు త్యాగం చేయాల్సిందేనా..?

pawan-jana
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికలవైపు వేసే ప్రతి అడుగు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.పవన్ కళ్యాణ్ త్వరలో ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా మారనున్నాడు.ప్రస్తుతం పవన్ కు తెలంగాణలోనే ఓటు హక్కు ఉంది.భవిష్యత్తు లో జనసేన పార్టీ ఆంద్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకం కానున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ లో ఓటు హక్కు కలిగి ఉండాలని ఆయన అభిమానులు కోరారు. పవన్ సొంత జిల్లా అయిన పశ్చిమ గోదావరి ఏలూరు లో ఓటుహక్కు పొదలని ఆయన అభిమానులు కోరడంతో పవన్ అందుకు ఒకే చెప్పారు.

దీనికోసం ఏలూరులోని తనకు నివాస యోగ్యమైన ఇంటిని చూడాలని జనసేన పార్టీని ఆదేశించారు.పవన్ 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లోని ఏ చోట నుంచైనా పోటీ చేసే అవకాశం ఉంది.కానీ పశ్చిమ గోదావరి తన సొంత జిల్లా అనే చెప్పాలి. ఎందుకంటే తన తండ్రి నివసించింది పశ్చిమగోదావరిలోనే. ఈ నేపథ్యం లో సెంటిమెంట్ కోసం ఇక్కడినుంచే పోటీచేసే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.పవన్ మానియాతో గత ఎన్నికల్లో గోదావరి జిల్లాల్లో టిడిపి కి భారీ స్థాయిలో సీట్లు దక్కాయి. పశ్చిమ గోదావరి జిల్లా లో అయితే మొత్తం 15 సీట్ల లో 14 టిడిపికి, 1 సీటు మిత్ర పక్షమైన బిజెపి దక్కడం విశేషం.పవన్ ఈ సారికూడా టిడిపి- బిజెపి ల కూటమితోనే కలసి పోటీ చేస్తే జనసేనకు కొన్ని సీట్లు కేటాయించవల్సి ఉంటుంది. పవన్ స్వయంగా పశ్చిమ గోదావరి జిల్లా నుంచి పోటీ చేయాలనుకుంటే మాత్రం ప్రస్తుతం ఉన్న టిడిపి ఎమ్మెల్యే లలో ఎవరో ఒకరు త్యాగం చేయక తప్పని పరిస్థితి.

Comments