ప్రచురణ తేదీ : Thu, May 10th, 2018

పవన్ టార్గెట్… అవనిగడ్డ ?

ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తన జనసేన పార్టీని బలోపేతం చేసే పనిలో ఉన్నాడు. ఇప్పటికే జిల్లాలవారీగా కార్యాచరణ రూపొందిస్తున్న పవన్ కళ్యాణ్ బస్సు యాత్రను రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిపే సన్నాహాలు చేస్తున్నాడు. ఇక పవన్ కళ్యాణ్ ఎక్కడనుండి పోటీ చేస్తాడన్న విషయం పై ఆసక్తి ఏర్పడింది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ అనంత పురం జిల్లా నుండి పోటీ చేస్తాడని ..

మరో వైపు తిరుపతినుండి కూడా పోటీ చేసే అవకాశాలు ఉన్నట్టు వార్తలు వచ్చాయి .. తాజాగా జనసేన పార్టీ కి సంబంధించి అవనిగడ్డలో మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ అనంతరం జనసేన ఇంచార్జ్ ముత్తంశెట్టి కృష్ణారావు మాట్లాడుతూ .. పవన్ కళ్యాణ్ అవనిగడ్డ నుండి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయంటూ చెప్పడం ఆసక్తి రేపుతోంది. కృష్ణాజిల్లా లోని అవనిగడ్డ నుండి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే రాజకీయ సమీకరణాలు కూడా మారిపోతాయని అంటున్నారు. అయితే ఈ విషయం పై పవన్ త్వరలోనే ప్రకటిస్తాడని తెలిపారు.

Comments