ప్రచురణ తేదీ : Dec 7, 2017 3:15 AM IST

చిరంజీవి, జగన్ గురించి పవన్ సంచలన వ్యాఖ్యలు..!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటన కొనసాగుతోంది. కొద్ది సేపటి క్రితమే పవన్ కళ్యాణ్ జనసేన కార్యకర్తలతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పవన్ అన్ని రాజకీయ అంశాలని టచ్ చేస్తున్నారు. తాను రాజకీయాల్లోకి రావడానికి గల కారణాల్ని వివరిస్తూనే తన సోదరుడు చిరంజీవి రాజకీయ వైఫల్యం గురించి, ప్రతిపక్ష నేత జగన్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసారు. దివంగత నేత వైఎస్ గురించి కూడా పవన్ ప్రస్తావించారు.

తాను 2003 లోనే రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నట్లు తన తల్లిందండ్రులకు చెప్పానని పవన్ అన్నారు. రాజకీయ వ్యవస్థ బావుంటే తనకు ఆ ఆలోచనే వచ్చేది కాదని అన్నారు. తాన్ సోదరుడు చిరంజీవి రాజకీయాల్లో మార్పు రావాలని కోరుకున్నట్లు పవన్ తెలిపారు. కానీ కొందరు చిరంజీవికి ద్రోహం చేసారని సంచలన వ్యాఖ్యలు చేసారు. చిరంజీవికి ద్రోహం చేసిన వారందరికి గుణపాఠం చేబుతా అని వార్నింగ్ ఇచ్చారు. రాజకీయాల్లో రాజశేఖర్ రెడ్డి మంచి పనులతో పాటు అవినీతి కూడా చేశారని ఆరోపించారు. వైఎస్ చనిపోగానే జగన్ సీఎం కావాలని అనుకున్నారు. రాజకీయ వారసులు ముందుగా వారి ప్రతిభని నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. అందువల్లనే తాను జగన్ కు మద్దత్తు తెలపలేదని అన్నారు.

Comments