ప్రచురణ తేదీ : Sat, Apr 22nd, 2017

ఇది పవన్ కళ్యాణ్ కు స్ట్రాంగ్ వార్నింగ్..?


పార్ట్ టైమ్ పాలిటిక్స్ వ్యవహారం గురించి ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.రాజకీయం అనేది నిరంతరం జరిగే ప్రక్రియ.రాజకీయంటే ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉండాలి. వీలు చోసుకుని స్పందించాలనుకుంటే ప్రజలనుండి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం అయ్యే అవకాశం ఉంది.గత సార్వత్రిక ఎన్నికల్లో సినీనటుడు బాలక్రిష్ణ హిందూపురం నియోజకవర్గం నుంచి మంచి మెజారిటీ తో గెలుపొందిన విషయం తెలిసిందే.బాలయ్యకు అదే ఆదరణ ఎప్పుడూ కొనసాగుతుందనుకుంటే అది పొరపాటే అవుతుంది.

నియోజక వర్గంలో సమస్య వచ్చిన వెంటనే ముందుగా ఎమ్మెల్యే అందుబాటులో ఉండాలి.గతంలో హిందూపురం లో అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో బాలయ్య పాల్గొన్నారు.కానీ నియోజకవర్గం లో అసలు సమస్యని పరిష్కరించకుండా గత ఐదు నెలలుగా బాలయ్య నియోజకవర్గ ప్రజలకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది.వేసవి మొదలై నియోజకవర్గ ప్రజలు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న సమయం లో బాలయ్య నియోజకవర్గం వైపు చూడకపోవడంతో ప్రజలకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. దీని కారణంగానే మొన్న హిందూపురంలో మహిళలు భారీ సంఖ్యలో బాలయ్యకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. దున్న పోతులపై బాలయ్య పేరుకూడా దర్శనమిచ్చింది. బాలకృష్ణ సినిమాలతో బిజీగా ఉండడం వలనే నియోజకవర్గం లో పర్యటించలేదనే వాదన వినిపిస్తోంది. పార్ట్ టైమ్ పొలిటీషియన్ అనే విమర్శలను సైతం ఎదుర్కొనవలసి వస్తోంది.

ఇలాంటి విమర్శలనే జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా ఎదుర్కొంటున్నారు.ప్రస్తుతం పవన్ జనసేన పార్టీ అధినేత మాత్రమే. ప్రజా ప్రతినిధి హోదా లో పవన్ అధికారిక పదవిని అనుభవించడం లేదు. దీనివలన పవన్ కళ్యాణ్ కు ప్రస్తుతానికి ఇబ్బంది లేకపోనప్పటికీ భవిష్యత్తులో ఉండొచ్చని అంటున్నారు. పవన్ కు మిగతా రాజకీయ నాయకుల లా సినిమాలు తప్ప మారే వ్యాపారం లేదనేది వాస్తవమే. అలా అని వీలు చూసుకుని ప్రజా సమస్యలపై స్పదించే రాజకీయాల్లో కుదరదు.బాలయ్య పై హిందూపురం ప్రజల ఆగ్రహం పవన్ కళ్యాణ్ కు కుడా హెచ్చరిక లాంటిదని విశ్లేషకులు అంటున్నారు.2019 ఎన్నికల్లో పోటీ చేయాలనీ భావిస్తున్న పవన్ తాను పార్ట్ టైమ్ పోటీషియన్ కాదు అనే భావనని ప్రజల్లో కలిగించాలని విశ్లేషకులు అంటున్నారు.

Comments