ప్రచురణ తేదీ : Dec 7, 2017 9:10 PM IST

షాక్ ల మీద షాక్ లు ఇస్తున్న పవన్..ఆ రోజు అల్లు అరవింద్ వల్లే..!

పవన్ ప్రజారాజ్యం తాలూకు గతాన్ని మొత్తం తవ్వి.. ఆ పార్టీ అంతరించి పోవడానికి కారకులైన వారందరిని ఓ రౌండ్ ఏసుకుంటున్నారు. పవన్ మాటల తూటాలు ఈ సారి అల్లు క్యాంప్ లోకి సరాసరిగా దూరిపోయాయి. ఇప్పటికే పవన్ కు అల్లు క్యాంప్ కు మధ్య డిఫరెన్సెస్ ఉన్నాయని మెగా అభిమానులు ఇప్పటికే చర్చించుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ తాజాగా అల్లు అరవింద్ పై చేసిన వ్యాఖ్యలతో ఇది నిజమే అని నిర్ధారణకు రావొచ్చు.

ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి కాంగ్రెస్ లో విలీనం చేశారని..ఆయన చుట్టూ ఉన్నవారివల్లే ఇది జరిగిందని జనసేనాని సంచలనమైన అభియోగం చేసారు. ఆ సమయంలో తాను కావాలనే సైలెంట్ గా ఉండిపోయానన్న పవన్ అందుకుగల కారణాలని వివరించారు. అల్లు అరవింద్ తనని కేవలం నటుడుగా మాత్రమే చూశారని తనలో ఉన్న సామజిక సృహ ఆయన గుర్తించలేదని అన్నారు. ప్రజారాజ్యం పార్టీ పనుల్లో అల్లుఅర్జున్, చరణ్ లకు ప్రాముఖ్యత ఇచ్చిన ఆయన తనని పక్కన పెట్టారని అన్నారు. అలాంటి వాతావరణంలో తాను ఏం మాట్లాడినా చెల్లదని అందుకే సైలెంట్ గా ఉండవలసి వచ్చిందని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఆలు అరవింద్ తో విభేదాలని మరింత పెంచేవిగా ఉన్నాయి.

Comments