ప్రచురణ తేదీ : Dec 7, 2017 1:20 PM IST

చంద్రబాబు ప్రభుత్వంపై పవన్ స్ట్రాంగ్ సెటైర్..!

ఇన్నిరోజులు స్తబ్దుగా ఉన్న జనసేన రాజకీయం పవన్ ఉత్తరాంధ్ర టూర్ తో ఒక్కసారిగా వేడెక్కింది. ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా పవన్ తనదైన పంచ్ డైలాగులు, సెటైర్లు విసురుతూ సుతి మెత్తగానే విమర్శల వేడి పంచుతున్నారు. నిన్న వైజాగ్ వేదికగా ప్రసంగాలతో ఊపేసిన పవన్ నేడు పోలవరం ప్రాజెక్ట్ ని సందర్శించారు. అక్కడ ఇంజనీర్లని, అధికారులని అడిగి ప్రాజెక్టు స్థితి గతులు తెలుసుకున్నారు. ప్రాజెక్ట్ గురించి పూర్తి అవగాహన పెంచుకుందుకే ఇక్కడికి వచ్చానని పవన్ అన్నారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు ప్రభుత్వంపై భారీ సెటైర్ విసిరారు. పోలవరం ప్రాజెక్ట్ విషయంలో కేంద్రంతో పోరాడతారా అని మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు జనసేనాని సమాధానం ఇచ్చారు. ముందు మన బంగారం మంచిదో కాదో తెలుసుకోవాలి కదా అని పవన్ అన్నారు. పోలవరం ప్రాజెక్ట్ పై శ్వేతపత్రం విడుదల చేయడానికి, అఖిలపక్షం నిర్వహించి కఖర్చుల లెక్కలు వివరించడానికి ప్రభుత్వానికి ఉన్న ఇబ్బందేంటో అని అన్నారు. సెక్రటేరియట్ ని ఏడాదిలో కట్టడానికి ఇబ్బందులు పడ్డ ప్రభుత్వం ఇంత హరీ ప్రాజెక్ట్ ని 2019 నాటికి పూర్తి చేస్తాయంటే అది హాస్యాస్పదమే అని వ్యంగ్యాస్త్రం సంధించారు.

Comments