హౌస్ ఆఫ్ లార్డ్స్ లో అవార్డు అందుకున్న జనసేనాని !

లండన్ లోని ఇండియన్ యూరోపియన్ బిజినెస్ ఫోరమ్(ఐఈ బి ఎఫ్) గ్లోబల్ ఎక్సలెన్స్ అవార్డుని జనసేనాని పవన్ కు ప్రకటించిన సంగతి తెలిసిందే. అవార్డు అందుకునేందుకు, ఇండియన్ యూరోపియన్ బిజినెస్ ఫోరమ్ సదస్సులో పాల్గొనేందుకు పవన్ కళ్యాణ్ లండన్ వెళ్లారు. వివిధ కార్యక్రమాలతో ఇప్పటికే పవన్ కళ్యాణ్ లండన్ లో బిజీగా ఉన్నారు. కాగా కొద్దీ సేపటి క్రితమే పవన్ బ్రిటన్ పార్లమెంట్ హౌస్ ఆఫ్ లార్డ్స్ లో అవార్డుని అందుకున్నారు.

ఇండియన్ యూరోపియన్ బిజినెస్ ఫోరమ్ సదస్సులో పాల్గొన్న అనంతరం లండన్ లోని తెలుగు యువతతో జనసేనాని భేటీ కానున్నట్లు తెలుస్తోంది. జనసేన పార్టీ విధి విధానాలని పవన్ కళ్యాణ్ వారికి వివరిస్తారట.

Comments