ప్రచురణ తేదీ : Dec 6, 2017 3:50 AM IST

బర్నింగ్ మ్యాటర్ తో రేపటి నుంచి జనంలోకి పవన్ కళ్యాణ్..!

అజ్ఞాతవాసి షూటింగ్ ముగిసింది. కొంచెం కూడా గ్యాప్ లేకుండా అజ్ఞాతవాసి జనసేనానిగా మారిపోతున్నాడు. రేపటి నుంచి ప్రజల్లోకి వచేస్తున్నానంటూ పవర్ ఫుల్ స్టేట్ మెంట్ వదిలేసారు. పోలవరం, కాపు రిజర్వేషన్లు, జగన్ పాదయాత్ర వంటి విషయాలతో వేడెక్కి ఉన్న ఎపి పాలిటిక్స్ ని మరింత వేడెక్కించేందుకు పవన్ కళ్యాణ్ సిద్ధం సిద్ధం అయిపోయారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ అధికారికంగా ప్రకటన విడుదుల చేశారు. బుధవారం నుంచి పవన్ కళ్యాణ్ మూడు రోజుల పాటు ఉత్తరాంధ్ర జిల్లాలో పర్యటించనున్నారు. నాల్గవ రోజు పవన్ కళ్యాణ్ ఒంగోలులో పర్యటించనున్నారు. కృష్ణ పడవ ఘటన భాదిత కుటుంబాలని పవన్ కళ్యాణ్ పరామర్శిస్తారు.

ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ ఓ హాట్ టాపిక్ తో తెలుగు రాష్ట్రాల పర్యటన మొదలు పెట్టనున్నారు. విద్యార్థుల ఆత్మహత్య తెలంగాణ, ఏపీ లని కుదిపేస్తోంది. ఇటీవలే ఆత్మహత్య చేసుకున్న ఉస్మానియా విద్యార్థి మురళి, విజయ నగరం యువకుడు వెంకటేష్ ల విషయాన్ని పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. తక్షణమే మురళి కుటుంబ సభ్యులని పరామర్శించాలని ఉందని కానీ పోలీస్ వారి ఆంక్షలు అమలులో ఉండడంతో వీలు పడడం లేదని పవన్ కళ్యాణ్ అన్నారు. తాను ఇప్పటికే మురళి సోదరుడితో మాట్లాడానని అతడి వేదన తన హృదయాన్ని కలచి వేసినట్లు పవన్ చెప్పుకొచ్చారు.

ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ తెలుగు రాష్ట్రాల పర్యటన మూడు విడతలుగా సాగనుంది. తొలి విడతలో సమస్యపై అవగాహన కొరకు పర్యటిస్తారు. రెండవ విడతలో సమస్య పరిష్కారానికి చర్యలు, ప్రభుత్వం దిగిరాని నేపథ్యంలో మూడవ విడతలో పోరాటం చేస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. డ్రెడ్జింగ్ ప్రైవేటీకరణ వలన ఆత్మహత్యకు పాల్పడిన విజయ నగరం యువకుడు వెంకటేష్ కుటుంబాన్ని పరామర్శించడానికి పవన్ కళ్యాణ్ విజయనగరంలో రేపు పర్యటిస్తారు. నిరాశలో ఉన్న యువతలో ఆత్మస్థైర్యం నింపేలా ‘చలోరే చలో’ అనే గీతాన్ని పవన్ విడుదల చేయనున్నారు.

Comments