ప్రచురణ తేదీ : Jan 28, 2017 3:45 AM IST

పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ లో హైలెట్స్

pawan-kalyan
* ఓటుకు నోటు కేసులో తాను మాట్లాడకపోవడానికి ప్రధాన కారణం ఇది ఒక్క తెలుగుదేశం పార్టీ నే చేసి ఉంటే తాను నిలదీసేవాడిని అని, ఇలాంటి పనులు అన్నాయి పార్టీలు చేస్తున్నాయని అందుకే తాను మాట్లాడలేదని, మీరు దీనిని వెనకేసుకురావడం అని అన్నా తాను పట్టించుకోనని పవన్ కళ్యాణ్ అన్నారు.

* ప్రధాని నరేంద్ర మోడీ నుండి భారత ప్రజలు బలమైన ప్రజాస్వామ్యాన్ని కోరుకున్నారని, కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, రోహిత్ వేముల, నోట్లరద్దు లాంటి చర్యలతో మోడీ ఒంటెద్దుపోకడలు పోతున్నారని పవన్ కళ్యాణ్ విమర్శించారు. మోడీ అనుకున్నది చేసుకుంటూ పోతున్నారు కానీ ప్రజల మనోభావాల గురించి పట్టించుకోవడం లేదని పవన్ అన్నారు.

* జయలలిత మరణం తరువాత బీజేపీ అక్కడ అధికారం చలాయించాలని చూస్తుందని, అందుకే అక్కడి యువత అది సహించలేక జల్లికట్టు పేరుతొ ఉద్యమం చేసి బీజేపీ ని లొంగదీసుకున్నారని పవన్ అన్నారు.

* ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ ప్రభుత్వం లేదని అక్కడ మినీ బీజేపీ పాలనా నడుస్తున్నట్టు ఉందని పవన్ అన్నారు. చంద్రబాబు నాయుడు అనుభవం ఉన్న వ్యక్తి అని ఆయనకు తాను మద్దతు ఇచ్చాను. నోట్లరద్దుపై ముఖ్యమంత్రి ఐదు రకాలుగా మాటలు మార్చారు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంతో ఎందుకు రాజీ పడ్డారో ప్రజలకు చెప్పాలని పవన్ డిమాండ్ చేశారు. కేంద్రం నుండి రాజీ పడాలని మీ మీద ఒత్తిడి వచ్చిందా చెప్పాలని అన్నారు.

* కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఎన్నికల ముందు 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా కావాలని మాట్లాడి, ఇప్పుడేమో అది సంజీవని కాదు అంటున్నారు. మీరు రోజుకో మాట మాట్లాడితే ప్రజలు ఊరుకోరు అన్నారు. మీ స్వర్ణభారతి ట్రస్ట్ మీద పెట్టిన మనస్సు ఆంధ్రప్రదేశ్ పైన, వాళ్ళ సమస్యల పైనా పెడితే ఎప్పుడో ప్రత్యేక హోదా వచ్చి ఉండేదని పవన్ విమర్శించారు.

* సుజనా చౌదరి గారు జల్లికట్టు ను స్ఫూర్తిగా తీసుకుని పందుల పందేలు ఆడుకోమనడం ఎంతవరకు సబబో ఆలోచించుకోవాలని, ఆయన వ్యాఖ్యలు ఎంతమంది మనోభావాలను దెబ్బ తీశాయో తెలుసా అని విమర్శించారు. మీరు ఎవరిని స్ఫూర్తిగా తీసుకుని బ్యాంకు రుణాలు ఎగ్గొట్టారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.

* కేంద్ర ప్రభుత్వానికి దక్షిణాది ప్రజలు బానిసల్లా కనిపిస్తున్నారని, బానిసలు తిరగబడితే ఎలా ఉంటుందో తెలుస్తుందని పవన్ అన్నారు. దాదాపు 1500 మంది తెలంగాణ ప్రజలు తెలంగాణ కోసం చనిపోతే కానీ కేంద్ర నాయకులకు తెలీలేదు. అదే ఒక ఉత్తరాది వారు ఎవరైనా కాలు జారి పడిపోతే వెంటనే స్పందిస్తారు అని తీవ్ర స్థాయిలో విమర్శించారు.

* ఒక పెళ్ళై కూతురు కూడా ఉన్న రాంగోపాల్ వర్మ బూతు సినిమాలు చూస్తానని చెబుతారు. అలాంటి వాళ్ళ గురించి తాను మాట్లాడానని పవన్ అన్నారు.

Comments