వీడియో : త్రివిక్రమ్ మాటలతో జనసేన పాట !

పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా వేయబోయే అడుగులపై క్లారిటీ వచ్చింది. ఉత్తరాంధ్రలో రేపు పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. కాగా యువతలో ఆత్మస్థైర్యం నింపేలా పవన్ ఛలోరె ఛలోరె కహ్ల్ అనే సాంగ్ ని కొద్దీ సేపటి క్రితమే విడుదుల చేసారు. వింటారా.. వెనకాలే ఉందాం వస్తారా అంటూ త్రివిక్రమ్ మాటలతో ఈ పాట మొదలవుతోంది. ఓ ఆడియో ఫంక్షన్ వేదికగా త్రివిక్రమ్ అన్న మాటలు అవి.

మిత్రమా అసలే చీకటి..ఇల్లేమో దూరం.. దారంతా గోతులు.. చేతిలో దీపం లేదు..ధైర్యమే ఓ కవచం అంటూ సాగె పవన్ వ్యాఖ్యలతో ఈ ప్రత్యేక గీతాన్ని రూపొందించారు. పవన్ కళ్యాణ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఎప్పుడు అనే ప్రశ్నలకు తాజా ప్రకటనతో ఫుల్ స్టాప్ పడింది. మూడంచెలుగా జనసేనాని తెలుగు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు.

Comments