ప్రచురణ తేదీ : Feb 4, 2018 7:28 PM IST

జనసేన పార్టీ ఆఫీస్ లో వెలుగులోకి వచ్చిన కొత్త సమస్య !

సమస్యలు ఉన్న వారందరికీ ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గుర్తుకు వస్తున్నారేమో. పలు రకాల సమస్యలన్నీ జనసేనపార్టీ ఆఫీస్ కేంద్రంగానే వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఏపీలోని మరో సమస్య జనసేన పార్టీ కార్యాలయంలో విన్నవించబడింది. ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన నర్సరీ పెంపకం దారులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని కలిశారు. ఈ సందర్భంగా వారు పవన్ కు తమ సమస్యలని విన్నవించుకున్నారు.

ప్రభుత్వ అధికారులు తమని వ్యాపారస్థులుగా గుర్తించి ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. తమకు ఉచిత కరెంట్ కూడా అందడం లేదని వాపోయారు. ప్రభుత్వం తమని రైతులుగా గుర్తించేలా సాయం చేయాలని పవన్ కళ్యాణ్ ని కోరారు. కడియం నర్సరీ రైతులు వివిధ రకాల మొక్కల ఉత్పత్తులని రాష్ట్రానికి అందిస్తున్నారని వారిని రైతులుగా గుర్తించాల్సిన అవసరం ఉందని పవన్ కళ్యాణ్ అన్నారు. వారికీ ఉచిత విధ్యుత్ అందించి ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ నర్సరీ ఉత్పత్తి దారులని రైతులుగా గుర్తించేందుకు కృషి చేస్తుందని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. ఇటీవల చలోరే చలోరే చల్ యాత్రని అనంతపురంలో పూర్తి చేసుకున్న పవన్ కళ్యాణ్ తదుపరి యాత్రకు సమాయత్తం అవుతున్నారు.

Comments