యువతి ప్రశ్న.. మానవత్వానికి డెఫినిషన్ ఇచ్చిన పవన్..!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లండన్ లో తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ (TAL) నిర్వహించైనా యువ సమ్మేళనం లో పాల్గొన్నారు. యువతీ యువకులతో ఉత్సాహభరితంగా సాగినా ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. సామజిక సేవలో చురుగ్గా ఉండే పవన్ మరో మారు కులానికి వ్యతిరేకంగా గట్టిగా తన గొంతుని వినిపించారు. ఓ యువతి అడిగిన ప్రశ్నకు సమాధానంగా పవన్ కళ్యాణ్ మానవత్వానికి నిర్వచనం ఇచ్చారు.

కుల, వర్ణ ప్రాంతాలంటూ ఏ అడ్డుగోడలు లేకుండా సమభావంతో మెలగడమే మానవత్వం అని పవన్ అన్నారు. ఎవరు రాజకీయాల్లోకి వచ్చినా నువ్వు పాలనా కులం వాడివి అనే ముద్ర వేయడానికి కొందరు ప్రయత్నిస్తారు. నా మేడలో కూడా అలాంటి బిళ్ళ తగిలించడానికి కొందరు ప్రయత్నిస్తున్నారు. ఈ విషయం తాను ఒక్కటే గట్టిగా చెప్పదలుచుకున్నానని, కుల ప్రాతిపదిక మీద ఎవరు మద్దత్తు ఇచ్చినా తీసుకోనని యువసమ్మేళనం వేదికగా తేల్చేశారు. నేను ఎలాంటి కులంలో పుట్టినా నాకు క్రిస్టియన్ పాప పుట్టింది. మన ఛాయిస్ కానీ కులానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదని పవన్ యువతకు పిలుపు నిచ్చారు. యువసమ్మేళనంలో పాల్గొన్న తెలుగు యువతీ యువకులందరితో పవన్ ఇంటరాక్ట్ అయ్యారు.

Comments