ప్రచురణ తేదీ : Feb 8, 2017 5:58 PM IST

అమెరికాలో సెటిల్మెంట్లు చేయనున్న పవన్ కళ్యాణ్..!!


జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ అమెరికా వెళ్లారు. బోస్టన్ లోని హార్వర్డ్ యూనివర్సిటీ లో జరిగే ఇండియా కాన్ఫరెన్స్ 2017 లో పాల్గొనడానికి ఆయన అమెరికా వెళ్లారు. ఈ సదస్సుకు పవన్ కళ్యాణ్ తో పాటు మరో హీరో మాధవన్ కూడా హాజరు కానున్నారు. ఈ కార్యక్రమం ఈనెల 11,12 తేదీల్లో జరగనుంది. ఈ కార్యక్రమానికి పవన్ హాజరు కానున్నట్లు నిర్వాహకులు ఇప్పటికే ప్రకటించారు.

అమెరికాలో జనసేనాని ప్రసంగం కోసం అక్కడి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పవన్ వెళ్ళేది అక్కడ జరిగే సదస్సులో పాల్గొనడానికే అయినా రాజకీయ పరమైన సెటిల్మెంట్లు కూడా పవన్ అక్కడ చేసి రానున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. జనసేన పార్టీకి నిధుల కోసం ఆయన అక్కడి జనసేన అభిమానులు, ఎన్నారై లతో చర్చిస్తారని వార్తలు వస్తున్నాయి.

Comments