ప్రచురణ తేదీ : Dec 7, 2017 3:58 PM IST

అదే దూకుడు..చిరంజీవి అంత మంచోడిని కాదు..!

జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కళ్యాణ్ పోలవరం సందర్శించిన తరువాత రాజమండ్రి చేరుకున్నారు. ఈ సందర్భంగా జనసేనాని జనసైనికులతో ఏర్పాటుచేసిన సమావేశంలో ప్రసంగిస్తున్నారు. వైజాగ్ లో మొదలు పెట్టిన దూకుడే రాజమండ్రిలో కూడా జనసేనాని కొనసాగించడం విశేషం. ఒక్కొక రాజకీయ నేత పేరుని బయటకు తీసి మరి కడిగిపారేస్తున్నారు. నిన్న కొంత మంది టీడీపీ నేతలు, పరకాల ప్రభాకర్ పేర్లని ప్రస్తావించిన పవన్ నేడు బిసి సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య పై విమర్శలు చేసారు.

ఆర్ కృష్ణయ్య కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తే ఒప్పుకోనని అంటున్నారు. మీరు టీడీపీలోని నేతే. కాపురిజర్వేషన్ల హామీని చంద్రబాబు మేనిఫెస్టో లో పెట్టినరోజు ఎందుకు ప్రశ్నించలేదు? ఎందుకు అడ్డుకోలేదు ? ఇప్పుడెందుకు ఒప్పోకోనని అంటున్నారు ? కాపులకి బిసిలు వ్యతిరేకం అని ఎందుకు అనుకుంటున్నారు అని పవన్ అన్నారు.

నాపై విమర్శలు చేసే ముందు కొంచెం ఆలోచించండి. ప్రజారాజ్యం పార్టీ లాగా, ఆ పార్టీలో చేరిన కొందరి వ్యక్తుల లాగా నేను బలహీనమైన వ్యక్తిని కాదు. చిరంజీవి అంత మంచితనం నాలో లేదు. చిరంజీవి గారికి చాలా సహనం ఉంది ఆయన పడతారు. నేనలా కాదు. ప్రజలని మోసం చేసేటప్పుడు పడే వ్యక్తిని కాదు. వ్యతిగతంగా నన్ను దెబ్బకొట్టాలనుకుంటే సరే. ప్రజలకోసం ముందుకు వచ్చినప్పుడు దెబ్బ కొట్టాలనుకుంటే చూస్తూ ఊరుకోను అని తన దూకుడైన ప్రసంగాన్ని కొనసాగించారు.

Comments