ప్రచురణ తేదీ : Wed, Jan 31st, 2018

పవన్ కళ్యాణ్ తప్పించుకుంటున్నారు..!

జనసేనానికి విపక్షాల నుంచి ప్రశ్నలు ఎదురవుతున్నాయి. అనంతపురం టూర్ ముగించుకున్న జనసేనాని మరొక జిల్లా యాత్రకు సమాయత్తం అవుతున్నారు. తాను విధ్వంసకర రాజకీయాలు చేయనని చెప్పిన పవన్ కళ్యాణ్ తెలంగాణాలో కేసీఆర్ పట్ల, ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు పట్ల సాఫ్ట్ కార్నర్ తో ఉన్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ అధికార ప్రతినిధి జివి రెడ్డి పవన్ కు ప్రశ్నలు సంధించారు.

పార్టీ పెట్టి నాలుగేళ్లు మాత్రమే అవుతుందని తనని ప్రశ్నించవద్దని అంటే ఎలా ? పవన్ కళ్యాణ్ ప్రశ్నల నుంచి తప్పించుకు తిరుగుతున్నారు. పవన్ కళ్యాణ్ పార్టీ నిర్మాణం జరగకపోయి ఉండవచ్చు. కానీ ఆయనకు ప్రజల మద్దత్తు ఉందని వారికోసమైన పవన్ కళ్యాణ్ ప్రశ్నించాలి.. ప్రశ్నలకు సమాధానం చెప్పాలి అని జివి రెడ్డి అన్నారు. పార్టీలకు మద్దత్తు తెలిపే విషయంలో పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇవ్వాలని అన్నారు. ప్రజలకోసం రాజకీయాలు చేస్తున్నానని చెప్పిన పవన్ కళ్యాణ్ విపక్షాలని విమర్శించడం హాస్యాస్పదం అని అన్నారు.

Comments