రూ 11 లక్షలతో స్వామివారి రుణం తీర్చుకున్న పవన్ !

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చలోరే చలోరే యాత్ర మొదలైంది. కొద్ది సేపటి క్రితమే పవన్ కళ్యాణ్ కొండగట్టు కు చేరుకున్నారు. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 2009 లో విధ్యుత్ ప్రమాదం నుంచి బయట పడిన పవన్ కళ్యాణ్ కొండగుట్ట ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. అప్పటి నుంచి జనసేనాని కొండగట్టు అంజన్న ఆలయం సెంటిమెంట్ గా మారింది.

పూజలు నిర్వహించిన అనంతరం పవన్ కళ్యాణ్ గొండగట్టు ఆలయానికి రూ 11 లక్షలు విరాళం అందజేశారు. ఆలయ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని ప్రకటించారు. 2009 లో ప్రమాదం నుంచి బయటపడిన తనని రాజకీయ పరంగా కూడా స్వామివారి ఆశీర్వాదాలు ఉంటాయనే సెంటిమెంట్ ని పవన్ కళ్యాణ్ నమ్ముతున్నారు.ఆలయ అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ రూ 11 లక్షల విరాళం అందజేసి స్వామివారి ఋణం తీర్చుకున్నారని స్థానికులు అభిప్రాయ పడ్డారు. మొత్తంగా తాజాగా పవన్ కళ్యాణ్ టూర్ వలన తెలంగాణలో కూడా జనసేన రీసౌండ్ వినిపిస్తోంది.

Comments