ప్రచురణ తేదీ : Jun 9, 2018 11:22 PM IST

జనసేన పోరాట యాత్రకు బ్రేక్ ఇచ్చిన పవన్!

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరంతరంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోరాట యాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. నిన్న రాత్రి విశాఖపట్నం జిల్లాలోని ఎలమంచిలి సభను ముగించుకున్న పవన్ ఉదయం నుంచి విశాఖలోని కొందరు మేధావులుతో సమావేశం కానున్నారు. అయితే పవన్ కొన్ని రోజుల వరకు పోరాట యాత్రకు బ్రేక్ ఇవ్వనున్నాడని ఆ పార్టీ సభ్యులు ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు.

రేపు, ఎల్లుండి కూడా విశాఖ నగరానికి చెందిన వివిధ వర్గాల వారిని పవన్ కల్యాణ్ కలవనున్నారు. ఉత్తరాంధ్ర వెనకబాటు తనంపై వివిధ వర్గాల మేధావులుతో పవన్ చర్చలు జరిపి, పలు అంశాలపై అధ్యయనం కోసం ఈ మూడు రోజుల కాలాన్ని ఉపయోగించుకోనున్నారు. ఉత్తరాంధ్రలోని జన సైనికులకు ఉత్తరాంధ్ర వెనుకబాటు తనంపై అవగాహన కల్పించే విషయంపై ఒక ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఇక రెండు రోజుల పర్యటన అనంతరం సోమవారం సాయత్రం జనసేనుడు హైదరాబాద్ కు రానున్నారు. పవన్ వ్యక్తిగత సిబ్బంది ఎక్కువగా ముస్లిం లు ఉండడంతో వారితో రంజాన్ జరుపుకునేందుకు హైదరాబాద్ కు వస్తున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.

Comments