ప్రచురణ తేదీ : Oct 14, 2017 2:01 PM IST

ఉరుకులు పరుగులు.. కాలంతో పోటీ పడుతున్న పవన్ కళ్యాణ్..!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు బాధ్యతల భారం ఎక్కువవుతోంది. కుటుంబం, సినిమాలు అన్నింటికీ మించి జనసేన పార్టీ. మూడు భాద్యతలు ఒకేసారి నిర్వర్తించాల్సి రావడంతో జనసేనాని కాలంతో పరిగెడుతున్నాడట. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్నారు. సంక్రాంతికి విడుదల కావాల్సి ఉండడంతో షూటింగ్ ని త్వరగా పూర్తి చేయాల్సిన పరిస్థితి. మరో వైపు 2019 ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇంకా ఓనమాలు దశలోనే ఉన్న జనసేన పార్టీ గాడిలో పడాలంటే పవన్ ఇప్పటి నుంచే ప్రజల్లోకి వెళ్ళాలి. మరో వైపు కుటుంబ బాధ్యతలు.. పవన్ మూడవ భార్య ఆన లెజెనోవా ఇటీవల అందమైన కుమారుడికి జన్మనిచ్చింది. కొత్తగా పురుడు పోసుకున్న నేపథ్యంలో తల్లీకొడుకులకు చేయవలసిన ఫార్మాలిటీస్ ని పూర్తి చేసే పనిలో పవన్ బిజీగా ఉన్నాడట.

పవన్ కళ్యాణ్ భార్య ఆనా లెజెనోవా కుటుంబ సంప్రదాయాల ప్రకారం కొడుకుకు పలు కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా వచ్చే వారమే పవన్ తన చిత్ర షూటింగ్ లో కూడా జాయిన్ కానున్నాడు. ఇక జనసేన పార్టీ పనులు ఎలాగూ ఉన్నాయి. సినిమా, కుటుంబ బాధ్యతలని వీలైనంత త్వరగా పూర్తి చేసిన జనసేన పార్టీ కోసం పూర్తి స్థాయి సమయాన్ని కేటాయించాలని పవన్ భావిస్తున్నట్లు జనసేన వర్గాలు అంటున్నాయి. నవంబర్ నుంచి జనసేన పార్టీలో ప్రముఖమైన మార్పులు కనిపించబోతున్నాయని వినికిడి. జిల్లావారీగా అధికార ప్రతినిధులని నియమించి ఆ తరువాత ప్రజా యాత్రకు సిద్ధం కావాలనేది పవన్ ప్లాన్.

Comments