ప్రచురణ తేదీ : Dec 7, 2017 1:00 AM IST

డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఫ్లాష్ బ్యాక్..పవన్ అడుగుతోంది రైటా రాంగా..!!

పవన్ ఎక్కడ అడుగుపెట్టిన ఆ ఇష్యూ జనాల్లోకి వెళ్ళిపోతోంది. మొన్న ఉద్దానం..నేడు డ్రెడ్జింగ్ కార్పొరేషన్. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ గురించి చాలా మందికి తెలియకపోయి ఉండొచ్చు. సముద్ర, మరియు నదీ పరివాహక ప్రాంతాల్లో పేరుకుపోయిన వ్యర్థాలని తొలగించే ప్రక్రియే డ్రెడ్జింగ్. ఓ రకంగా పూడిక తీసే విధానం అన్న మాట. టూరిజం ప్రదేశాలలో, పోర్టులలో ఎక్కువగా డ్రెడ్జింగ్ కార్పొరేషన్ విధులు నిర్వహిస్తుంది. 1976 లో భారత ప్రభుత్వం డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఇండియా పేరుతో ప్రభుత్వ రంగ సంస్థని ఏర్పాటు ఏర్పాటు చేసింది. అప్పట్లో దీనిని 28 కోట్లతో ప్రారంభించారు. కాగా ఇప్పుడు దీని వ్యయం సుమారు 6 వేల కోట్లు. సంవత్సరానికి ఈ సంస్థ ద్వారా ప్రభుత్వానికి 300 కోట్ల ఆదాయం వస్తుండడం విశేషం. ఇంత భారీ మొత్తంలో ఆదాయం వస్తున్న సంస్థని ప్రభుత్వం ఎందుకు వదిలించుకోవాలనుకుంటోంది ? వివరాల్లోకి వెళదాం..!

డిసిఐ ద్వారా దాదాపు 15 వేల మంది ఉద్యోగులు ఉపాధి పొందుతున్నారు. ఓ విదేశీ సంస్థకు డిసి ఐ ని ప్రభుత్వం దారాదత్తం చేయాలనీ చూస్తోంది. ఆదాయంలో ఉన్న సంస్థని ప్రభుత్వం వదిలించుకోవాలని చూస్తుందంటే ఇందులో కచ్చితంగా కుట్ర ఉందని ఉద్యోగులు తేల్చేస్తున్నారు. విదేశీ సంస్థ కేంద్రంతో భారీ వ్యాపార డీల్ కుదుర్చుకుంది అందువలనే తమని నట్టేట ముంచేస్తున్నారనే అనుమానాలు ఉద్యోగులకు కలుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తూర్పు తీరంలో మరిన్ని పోర్టులని నిర్మించాలని ప్లాన్ చేస్తోంది. ఒక్క ఏపీలోనే నెల్లూరు టూ శ్రీకాకుళం 10 పోర్టులు పెరిగే అవకాశం ఉంది. అంటే భవిషత్తులో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ వ్యయం పెరగడం ఖాయం. ఈ నేపథ్యంలోనే దీనిని వదిలించుకోవాలని ప్రభుత్వం చూస్తున్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇవన్నీ లోలోపల జరుగుతున్న తంతులు. కానీ డ్రెడ్జింగ్ ఉద్యోగుల పనితీరు సరిగా లేదని, దీనిని ప్రయివేట్ పరం చేస్తే వారి సరిగ్గా పనిచేస్తారని కేంద్రం తన వాదన వినిపిస్తోంది. దేశంలో వందలాది ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి. వాటిలో నష్టాల బాటలో ఉన్న వాటి సంఖ్య ఎక్కువే. ప్రభుత్వానికి భారంగా సంస్థల్ని ప్రయివేటీకరించడం ఓ పద్ధతి. కానీ వందలాది కోట్ల ఆదాయం సాధిస్తున్న డ్రెడ్జింగ్ లాంటి సంస్థని ప్రైవేట్ పరం చేయడం ద్వారా ప్రభుత్వం ఇవ్వాలనుకుంటున్న సంకేతాలు ఏంటి అనేది జనసేనాని సూటి ప్రశ్న. ఉద్యోగులు వేదన కూడా అదే. పవన్ ఈ సమస్యని సీరియస్ గా తీసుకుని చకచకా మోడీకి లేఖ రాసేశారు.

Comments