ప్రచురణ తేదీ : Jan 22, 2017 11:10 PM IST

కట్టలు తెంచుకున్న పవన్ ఆగ్రహం..రాయపాటి పై పేలిన తూటాలు !

pk-pawan
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోలవరం ప్రాంత రైతుల సమస్యలపై దృష్టిపెట్టారు. ఇటీవల మూలలంక గ్రామ రైతులు పవన్ ను కలసి తమ భూములను ప్రభుత్వం బలవంతంగా లాక్కోవడానికి ప్రయత్నిస్తోందని పవన్ కు తెలిపారు. ఈ సమస్యపై తానూ సమగ్రంగా అధ్యయనం చేసి స్పందిస్తానని జనసేనాని వారితో చెప్పిన విషయం తెలిసిందే.కాగా నేడు పవన్ ఈ విషయం పై ట్విట్టర్ లో స్పందించారు. ప్రభుత్వం పోలవరం రైతుల విషయం లో అనుసరిస్తున్న విధానాల పై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. ఎన్నడూ లేని విధంగా పవన్ ప్రభుత్వం పై మాది పడ్డాడు.

పోలవరం మూలలంక రైతుల, కృష్ణ నది తీరం లో లంక గ్రామాల రైతుల కన్నీరు ప్రభుత్వానికి, రాష్ట్రానికి మంచిది కాదని పవన్ అన్నారు. మూలలంక లోని 207 ఎకరాల మాగాణి భూమిని రైతుల అనుమతి లేకుండా డంపింగ్ యార్డుగా మార్చడం ఎంతవరకు సమంజసమో ప్రజాప్రతినిధులే చెప్పాలని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. టిడిపి ఎంపీ రాయపాటి సాంభశివరావు గుత్తేదారు కంపెనీ ట్రాన్స్ ట్రాయ్ ఆడగోలుగా రైతుల భూమిని డంపింగ్ యార్డుగా మారుస్తుంటే ఈ విషయంలో స్పందించని ప్రజాప్రతినిధులను ఏమనుకోవాలని పవన్ మండిపడ్డారు.అక్కడ భూమి ఉన్న రైతులు తమవారు కాదనా లేక కాంట్రాక్టరు కు ఇబ్బందనా ? ప్రభుత్వం ఎందుకు నిర్లక్యం చేస్తోందని పవన్ ప్రశ్నించారు.గత్యంతరం లేని రైతులు తగిన నష్టపరిహారం అడిగితె వారి మోర ఎందుకు వినరంటూ పవన్ ఆగ్రహం వ్యక్తం చేసారు.అమరావతి లోని లంక గ్రామా ప్రాంత రైతుల భూముల విషయం లోను పవన్ ప్రభుత్వం పై విరుచుకుపడ్డారు. తాము దళితులం కావడం వల్లే పరిహారం చెల్లింపు విషయం లో తమ పై ప్రభుత్వం వివక్ష చూపుతోందని అక్కడి రైతుల ఆవేదనని పవన్ తెలియజేసారు. ఇది సమాజానికి అంచిది కాదంటూ పవన్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

pawan kalyan fires on ap govt

Comments