ప్రచురణ తేదీ : Wed, Oct 11th, 2017

బాబుకి ఆ చాన్స్ లేదు.. పవన్, జగన్ ఉపయోగించుకుంటారా..?

ఏపి పొలిటికల్ స్క్రీన్ పై సరికొత్త ఫైట్ ఆవిష్కృతం కాబోతోంది. అక్టోబర్ నుంచే తాను రెడీ అని చెప్పిన జనసేనాని కాస్త అలస్యమైనా నవంబర్ నుంచి ప్రజాక్షేత్రంలోకి వచ్చేందుకు సిద్దం అవుతున్నారు. ప్రతిపక్ష నేత జగన్ ఎలాగూ నవంబర్ 2 నుంచి పాదయాత్ర ప్రారంభించబోతున్నారు. ఎన్నికల సమరంలో నేగ్గుకురావాలంటే నాయకులు ప్రజలకు అందుబాటులో ఉండాలి. అలా ప్రజలకు అందుబాటులో ఉన్న నేతలకే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రజాక్షేత్రంలోకి వెళ్లబోతున్న పవన్ కళ్యాణ్, జగన్ లకు ఈ ఏడాది సమయం ఓ సదావకాశం అని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ అడ్వాంటేజ్ అధికార పార్టీ తెలుగుదేశంకు ఉండదు. ఎందుకంటే అధినేత చంద్రబాబు నుంచి మంత్రుల వరకూ అంతా పాలనా పరమైన పనుల్లో బిజీగా ఉంటారు. వారానికో నెలకో సభలు నిర్వహించడం, ప్రభుత్వ కార్యక్రమాల్ని ప్రజలకు వివరించే అవకాశం మాత్రమే ఉంటుంది.

కానీ అధికారంలో లేని పార్టీ అధినేతలు స్వయంగా ప్రజల్లో పర్యటించి వారి మనోగతాన్ని తెలుసుకోవచ్చు. గతంలో చంద్రబాబు, వై ఎస్ ఆర్ లు పాదయాత్రల ద్వారా ప్రజలని ఆకర్షించిన వారే. జగన్ కుడా అదే దారిని ఎంచుకున్నారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏరూపంలో ప్రజాయాత్ర చేస్తారనేది ఖరారు కాలేదు. ఏరూపంలో ప్రజల్లోకి వెళ్ళినా గ్లామర్ ఉన్న వ్యక్తిగా ప్రజలని ఆకర్షించే శక్తి పవన్ కు ఉంది. అధికార పార్టీకి లేని ఈ అవకాశాన్ని ఏడాది కాలం పాటు పవన్, జగన్ లు ఎలా ఉపయోగించుకుంటారానేదనిపైనే ఆయా పార్టీల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.

Comments